భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి గ్రామంలో దారుణం జరిగింది. గ్రామస్తుల కథనం మేరకు కంచరకుంట్ల రాజు (40) అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం మతిస్థిమితం కోల్పోయి కొంచెం పిచ్చి పిచ్చిగా ప్రవర్తించే వాడు. గురువారం అర్ధరాత్రి ఒంటిగంట సమీపాన మతి స్థిమితం కోల్పోయి కన్నతల్లిని గొడ్డలితో విచక్షణా రహితంగా నరికి చంపాడు. దీంతో పక్కింట్లో ఉండే మహిళ అడ్డుపడ గా మహిళ తల పై గొడ్డలితో నరకడంతో చుట్టుపక్కల వారు కొన ఊపిరితో ఉన్న మహిళను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. నిందితుడు రాజు స్థానికుల నుండి తప్పించుకొని గొడ్డలితో ఊరందరిని చంపేస్తా అంటూ పారిపోయి ఒంటరిగా ఉన్న వారి పై దాడి చేయడానికి ప్రయత్నిస్తూ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. సమాచారం మేరకు పోలీసులు రంగంలోకి దిగి రాజు కోసం గ్రామంలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఒంటరిగా ఎవరు బయటకు రావద్దని గ్రామస్తులను పోలీసులు హెచ్చరించారు. దీంతో తిరుమలగిరి గ్రామం ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై, విషాదఛాయలు అలుముకున్నాయి.
భూపాలపల్లి జిల్లాలో ఒళ్ళు గగుర్పొడిచే సంఘటన
80
previous post