దేశ భవిష్యత్తును నిర్ణయించే ఓటు పట్ల అలసత్వం వహించడం సరికాదని కృష్ణా జిల్లా కలెక్టర్ రాజా బాబు అన్నారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఓటు నమోదు, ఓటింగ్ లో పాల్గొనే విధానం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కానూరు సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కృష్ణాజిల్లా కలెక్టర్ రాజాబాబు తో పాటు ముఖ్యఅతిథిగా ఎన్నికల సంఘం బ్రాండ్ అంబాసిడర్ జ్యోతి సురేఖ పాల్గొన్నారు. ఈ సభకు ఉయ్యూరు ఆర్డిఓ రాజు అధ్యక్షత వహించగా సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల డీన్ పాండురంగారావు తదితరులు ఈ సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అర్జున అవార్డు గ్రహీత ఎన్నికల సంఘం బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి జ్యోతి సురేఖ మాట్లాడుతూ యువత ఓట్లపై అవగాహన పెంచుకోవడంతో పాటు సమాజంలోని మరి కొంతమందికి అవగాహన కల్పించే విధంగా ఉండాలని సూచించారు. జిల్లా కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ దేశ భవిష్యత్తును మన తలరాతలను మార్చే ఓటు హక్కును ప్రతి ఒక్కరూ గుర్తించి ఓటు నమోదు చేసుకోవటంతో పాటు ఓటింగ్ రోజు తప్పనిసరిగా ఓటు వేయవలసిందిగా కోరారు. ప్రజాస్వామ్యము ఓట్ల అవగాహన పై కళాశాల విద్యార్థి ప్రకాష్ ప్రసంగం అందరిని ఉత్తేజపరిచింది. జిల్లా కలెక్టర్ సైతం ప్రకాష్ ప్రసంగానికి ముగ్ధుడై అతన్ని సత్కరించారు.
దేశ భవిష్యత్తును నిర్ణయించే ఓటు…
59
previous post