123
జగిత్యాల జిల్లాలోని మెట్టుపల్లి పట్టణంలో గల త్రిశక్తి దేవాలయం తూర్పు ద్వారానికి అడ్డుగా గుర్తు తెలియని వ్యక్తులు రాత్రికి రాత్రి గోడను నిర్మించారు.
ఉదయమే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గుడికి అడ్డుగా ఉన్న గోడను తొలగించి విచారణ చేపట్టారు. త్రిశక్తి దేవాలయ కమిటీ చైర్మన్ ద్యావనపల్లి రాజారామ్ మాట్లాడుతూ ఉదయం గుడికి వచ్చి చూసేసరికి అక్రమంగా గోడ నిర్మించి ఉందని, వెంటనే స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ కమిషనర్, సిఐ గారికి సమాచారం అందించామని పోలీసుల ఆధ్వర్యంలో గోడను తొలగించారని, దేవాలయం ముందు ఉన్న ఖాళీ స్థలం అన్ని దేవాలయాలకు సంబంధించిందని ఎమ్మెల్యే గారు ఊరి పెద్దమనుషులు, పోలీసులు చొరవ తీసుకుని ఇలాంటివి మళ్ళీ పునరావృత్తం కాకుండా చూడాలని కోరారు.