వైసీపీలో ఇంచార్జుల మార్పులపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వం వెంటిలేటర్ మీద ఉందని, అందుకనే వైసీపీలో మార్పులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. శ్రీకాకుళం జిల్లా టీడీపీ కార్యాలయంలో అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ సహా వైసీపీ నాయకులందరూ అవినీతిలో కూరుకుపోయారని ఆరోపించారు. ఇక నియోజకవర్గ ప్రజలు వ్యతిరేకిస్తే మరో చోట ఆహ్వానిస్తారా అని ప్రశ్నించారు. చెల్లని రూపాయి ఏ నియోజకవర్గంలోనైనా పనికి రాదని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిని జగన్ ప్రభుత్వం ఉక్కుపాదంతో తొక్కేసిందని మండిపడ్డారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన ఘనత జగన్‌దేనని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ పేరు చెబితేనే అసహించుకునే పరిస్థితికి తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. రాష్ట్ర రాజధాని ఏది అంటే చెప్పుకోలేని స్థితిని కల్పించాలన్నారు. అధికారం చేపట్టి నాలుగున్నరేళ్లు అవుతున్నా రాష్ట్ర ప్రగతిపై ఏం సాధించారని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో అభివృద్ధి, సంక్షేమం కూడా సమానంగా కొనసాగించారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
ఇన్చార్జిల మార్పులపై అచ్చెన్నాయుడు విమర్శలు…
77
previous post