123
పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాద క్షతగాత్రులను పరామర్శించారు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్. బాపట్ల జిల్లా సంతమగులరు మండలం ఎల్చురు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 5లక్షల రపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే. మృతుల కుటుంబాలన్నీ కూలి పని చేసుకునే వాళ్లని.. ప్రభుత్వం వారిని ఆదుకోవాలని కోరారు.