75
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ఉద్ఘాటన అనంతరం రెండవసారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుంచి ఫాల్గుణ శుద్ధ ద్వాదశి వరకు 11 రోజుల పాటు శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. ఇవాళ్టి నుంచి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు, స్వస్తి పుణ్యహ వాచనంతో శాస్త్రోక్తంగా ఆరంభమై, ఈ నెల 21వ తేదీ అష్టోత్తర శతఘటాభిషేక పూజలతో ముగుస్తాయి. మొదటి రోజు బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు హాజరుకానున్నారు. కాగా ఈ నెల 17న స్వామివారి ఎదుర్కోలు, 18న స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం, 19న స్వామివారి దివ్య విమాన రథోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో తెలిపారు.