ఇక ఓటర్ల మీదే భారం అంతా..

Voters

Advertisements

&NewLine;<p>తెలంగాణలో పార్టీ ప్రచారం ముగిసింది&period; మైకులు మూగబోయాయి&period; చివరి రోజు ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు తమ ప్రచారాన్ని హోరెత్తించారు&period; రోడ్ షో లతో హడావుడి చేశారు&period; ఇక ఓటర్ పై భారం వేశారు&period; సీఎం కేసీఆర్&comma; కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్&comma; ప్రియాంక&comma; బీజేపీ తరఫున మహారాష్ట్ర సీఎం&comma; డిప్యూటీ సీఎంలు&comma; కేటీఆర్&comma; హరీశ్ రావు&comma; రేవంత్ రెడ్డి సహా పలు పార్టీల ముఖ్య నేతలు ప్రచారంలో పాల్గొన్నారు&period; రేపు ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది&period; మావోయిస్ట్ ప్రభావిత ప్రాంత జిల్లాల్లో గంట ముందుగానే పోలింగ్ ముగియనుంది&period; జిల్లాలో మొత్తం ఐదు నియోజకవర్గాల్లో 9&comma;66&comma;439 మంది ఓటర్లు ఉన్నారు&period; 1098 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా&period;&period; 320 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు&period; మొత్తం 95 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు&period; పొత్తులో భాగంగా కాంగ్రెస్ నాలుగు స్థానాల్లో&comma; కొత్తగూడెంలో సీపీఐ పోటీలో ఉంది&period; బీజేపీ&comma; జనసేన కూటమి నేపథ్యంలో బీజేపీ మూడు స్థానాల్లో&comma; జనసేన రెండు స్థానాల్లో పోటీకి దిగింది&period; ఏ పార్టీ భవితవ్యం ఏంటనేది ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంటుంది&period; డిసెంబర్ 3న ఇక తెలంగాణను ఏలేది ఏ పార్టీ అనేది తేలిపోతుంది&period; ఓటర్లు ఎవరిని దీవిస్తారు&quest; ఎవరికి పట్టం కడతారు&quest; అనే అంశంపై ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు రాజకీయ నేతలు&period; అయితే&comma; అంతకంటే ముందుగానే&period;&period; జనం నాడి ఏంటి&quest; ప్రజలు ఎవరి వైపు ఉన్నారు&quest; ఏ పార్టీకి అధికారం కట్టబెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు&quest; అనే అంశాన్ని తేల్చేందుకు అనేక సంస్థలు సర్వేలు నిర్వహించాయి&period; ప్రజల మూడ్ ఏంటో తెలుసుకున్నాయి&period; వారు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారో నిర్ధారించాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పశ్చిమగోదావరి జిల్లాలో మెరిట్ విద్యార్థులకు ఎమ్మెల్యే బహుమతులు..

కమిటీల ఏర్పాటుపై కీలక ఆదేశాలు..

ఏపీలో వితంతువులకు శుభవార్త..