చిత్తూరు జిల్లా.. గంగవరం మండలానికి చెందిన ఇద్దరు చిన్నారులు మాజీ మంత్రి అమర్నాథరెడ్డి (Amarnath Reddy) పై తమ వెలకట్టలేని అభిమానాన్ని చాటుకున్నారు. ఆ చిన్నారుల కోరిక మేరకు ఆయన నామినేషన్ దాఖలు చేశారు. వివరాల్లోకెళ్తే… గంగవరం మండలం మేలుమాయి పంచాయతీలోని గుండ్లపల్లి గ్రామంలో మాజీ మంత్రి అమరనాథ రెడ్డి నాలుగు నెలల క్రితం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. ఈ సందర్భంగా అదే గ్రామానికి చెందిన జయరామి రెడ్డి కుమార్తెలు గీతిక మరియు షాలినీలు తమ పొదుపు చేసి దాచుకున్న (కిడ్డి బ్యాంకు) హుండీ సొమ్మును ఆయనకు అందించి ఈ సొమ్మును నామినేషన్ కొరకు వాడుకోవాలని కోరారు. దీంతో చిన్నారులు అభిమానంగా అందించిన ఆ హుండీని దేవాలయంలో పూజల అనంతరం పగలగొట్టి అందులోని రూ.4701 సొమ్మును నామినేషన్ దరఖాస్తు సొమ్ము కొరకు వాడుకొని ఆ చిన్నారుల కోరికను తీర్చారు. ఈ అంశాన్ని చూసిన పలువురు ఓ వైపు చిన్నారుల అభిమానం వెలకట్టలేనిదైతే, ఆ అంశాన్ని నాలుగు నెలల తర్వాత కూడా గుర్తుంచుకొని మాజీ మంత్రి వారి కోరికను తీర్చడం గొప్ప విషయమని కొనియాడారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రి మూసివేతపల్నాడు జిల్లాలో కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రిని మూసేశారు. గురజాల నియోజకవర్గం దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని లాలా బజారులో ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రానికి కరెంటు బిల్లు కట్టలేదనే సాకుతో మూసీవేశారు.గత వైసీపీ హయాంలో సుమారు…
- ఏపీలో 53 బార్లకు రీనోటిఫికేషన్ఏపీలో 53 బార్ల వేలం కోసం ఎక్సైజ్ శాఖ రీనోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 22 వరకు దరఖాస్తులు సమర్పించేందుకు గడువుగా నిర్ణయించారు. ఈ నెల 23న దరఖాస్తులను పరిశీలిస్తారు.…
- 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాంఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం అధికారులు, ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు. చైనాలోని త్రీ గోర్జెస్ డ్యామ్ కంటే పోలవరం మెరుగైన ప్రాజెక్టు అని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం 2014-19 మధ్య రాత్రింబవళ్లు శ్రమించామని…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి