జగన్, వెలంపల్లి అవినీతి గురించి పోతిన మహేష్ కే ఎక్కువ తెలుసని జన సేన సమన్వయ కర్త అమ్మి శెట్టి వాసు (Ammisetty Vasu) అన్నారు. గత ఐదేళ్లుగా వారిద్దరి అవినీతి గురించి ప్రెస్ మీట్లు పెట్టి ఎన్నో విషయాలు చెప్పిన మహేష్ కు వైసిపి లో చేరగానే వారిద్దరూ పునీతులు ఐపోయారా.. అని వాసు ప్రశ్నించారు. జన సేన వీర మహిళలు మల్లెపూడి విజయలక్ష్మి, తిరుపతి అనూష తో కలసి వాసు మీడియాతో మాట్లాడారు. జగన్, వెలంపల్లి అవినీతి పై మహాష్ కు ఉన్నంత అవగాహన మరెవరికీ లేదన్నారు. వ్యక్తిగత స్వార్థం కోసం మహేష్ వైసిపికి పే టీమ్ బ్యాచ్ గా మారిపోయారని, అప్పటి వరకు అవినీతి పరులైన వారు ఆయన పార్టీ మారగానే దేవుళ్ళు ఐపొయారా అని వాసు ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ సినిమాల గురించి, ఆస్తుల గురించి మహేష్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మరో సారి ఇదే విధంగా ఆయన వ్యవహరిస్తే మాత్రం జన సైనికులు మహేష్ ఇంటిని ముట్టడించేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
అంతే కాదు మహేష్ చేసిన అవినీతి. మోసాల చిట్టాను కరపత్రాల రూపంలో ఇంటింటికీ పంపిణీ చేస్తామన్నారు. పశ్చిమ నియోజక వర్గాన్ని అభివృద్ధి పరచేందుకు బీజేపీ తరఫున రంగం లోకి దిగిన సుజనా చౌదరి గురించి మాట్లాడితే సహించబోమని, ఆయన గెలుపు ఇప్పటికే ఖాయమైపోయిందన్న విషయాన్ని నియోజక వర్గ ప్రజలు అంగీకరి స్తున్నారని వాసు అన్నారు. పార్టీలో ఉంటూనే వైసిపి కి మహేష్ కోవర్టుగా పనిచేశారని వాసు అన్నారు. పవన్ పొత్తు ప్రకటన చేశాక టపాసులు కాల్చింది పోతిన కాదా అన్నారు. మహేష్ కోసం చంద్రబాబు తన సీట్లు త్యాగం చేసింది గుర్తు లేదా అని వాళ్ల నాయకులను ఒప్పించింది నిజం కాదా అని వాసు ప్రశ్నించారు. పశ్చిమం లోని 22 డివిజన్ల జనసేన అధ్యక్షులు కూడా సమావేశంలో పాల్గొన్నారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపంపసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది. దేశంలో అతిపెద్ద నగరమైన పోర్ట్ విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.…
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..తెలంగాణ శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే…
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్‌తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. తొలుత ఏపీలో…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి