విద్యుత్‌తో పనిచేస్తూ గాల్లో ఎగిరే ట్యాక్సీ మోడల్‌ను హ్యూందాయ్ మోటార్స్ ‘2024-కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ షో’లో ప్రదర్శించింది. నిట్టనిలువుగా ల్యాండింగ్, టేకాఫ్ అయ్యే సామర్థ్యం ఉన్న ఈ ట్యాక్సీని హ్యుందాయ్ మోటార్ గ్రూప్‌నకు చెందిన అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ కంపెనీ ‘సూపర్నల్’ తయారు చేసింది. నగరంలో రోజువారీ కార్యకలాపాలకు ఈ ట్యాక్సీ ఉపయోగపడుతుందని కంపెనీ చెబుతోంది.
Follow us on : Facebook, Instagram & YouTube.
25 నుంచి 40 మైళ్ల దూరం ప్రయాణించేందుకు ఇది పనికొస్తుందని వివరించింది. గంటకు 193 కి.మీ వేగంతో దూసుకెళ్తున్న ఎలక్ట్రిక్ ట్యాక్సీ. 1500 అడుగుల ఎత్తులో ప్రయాణించగలదు. పైలట్, నలుగురు ప్యాసింజర్లు కూర్చునే వెసులుబాటు ఉంటుంది. విద్యుత్ ప్రొపల్షన్ ఆర్కిటెక్చర్ ఫీచర్‌తో వస్తున్న ఈ ట్యాక్సీకి ఎనిమిది రోటర్లు ఉంటాయి. అతి తక్కువ శబ్దంతో ఇది పనిచేస్తుంది. వర్టికల్ ల్యాండింగ్, టేకాఫ్ సమయంలో ఇది 65 డెసిబుల్స్ శబ్దం చేస్తుంది. గాల్లో ఎగిరే సమయంలో దీన్నుంచి 45 డెసిబుల్స్ శబ్దం వెలువడుతుంది.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.