బాపట్ల జిల్లా రేపల్లెలో అంగన్వాడిలు చెవిలో పూలు పెట్టుకోని నిరసన తెలియజేయడం జరిగింది. 9వ రోజు సమ్మె సందర్భంగా సమ్మె శిబిరంలో చెవిలో పూలు పెట్టుకోని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు జే. ఝాన్సీ మాట్లాడుతూ ప్రభుత్వాన్ని రోడ్డున పడేసిన నేపథ్యంలో డబ్బులు లేవని జీతాలు పెంచలేమని చెవిలో పూలు పెడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని అన్నారు. కనీస వేతనాలు అమలు చేయమంటాం, పెన్షన్ ఇవ్వమనటం, రిటైర్డ్ బెనిఫిట్ ఇవ్వమనటం, నేరం అన్నట్లు ప్రచారం నిర్వహిస్తామన్నారు. మేము అడిగేది న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం పట్టు విడవకుండా నిర్బంధాన్ని ప్రయోగిస్తుందన్నారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని ప్రభుత్వం దిగిరాక తప్పదని అన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో సిఐటియు బాపట్ల జిల్లా అధ్యక్షులు సిహెచ్. మణిలాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు ఆందోళన కొనసాగించినప్పటికీ ప్రభుత్వం స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది రాబోయే కాలంలో కలెక్టరేట్లు ముట్టడిస్తామని, ఛలో విజయవాడ నిర్వహిస్తామని ప్రభుత్వం స్పందించాలని అంగన్వాడీలను భయభ్రాంతులను చేయటం విరమించుకోవాలని అన్నారు.
చెవిలో పూలు పెట్టుకుని వినూత్న నిరసన….
62
previous post