భారత దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో కూడా 3000 పెన్షన్ ఇచ్చే రాష్ట్రం లేదని, సిఎం జగన్ మోహన్ రెడ్డి పరిపాలిస్తున్న ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే అని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నట్లు శాసన మండలి డిప్యూటి చైర్మన్ జకియా ఖానం, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. అన్నమయ్య జిల్లా రాయచోటి మున్సిపల్ కార్యాలయం నందు మున్సిపల్ చైర్మన్ షేక్ ఫయాజ్ బాష ఆధ్వర్యంలో పెన్షన్ పెంపు కార్యకరమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాసన మండలి డిప్యూటి చైర్మన్ జకియా ఖానం, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి తో పాటు అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరిషా పీఎస్ లు హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలోఇచ్చిన హామీలన్నింటిని వంద శాతం నెరవేర్చిన ఘనత సిఎం జగన్ మోహన్ రెడ్డి కే దక్కుతుందన్నారు. గతంలో పెద్దాయన పరిపాలనాలో ప్రస్తుతం ఆయన ప్రతి పక్షంలో ఉన్నాడు. గత ప్రభుత్వ హయాంలో 70 సంవత్సరాలు వచ్చిన వారికి పెన్షన్ అందించే వారు. కొత్త పెన్షన్ ఎవరికైనా రావాలంటే ప్రస్తుతం ఉన్న పెన్షన్ దారుడు మరణిస్తే కానీ మంజూరు అయ్యే పరిస్థితులు ఉండేవి కాదన్నది మనందరికీ తెలిసిన విషయమేమన్నారు. కానీ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అర్హతే ఆదరంగా అర్హులైన ప్రతి ఒక్కరికి రెండు వందల రూపాయలు పెన్షన్ అందించారన్నారు. రెండు వందల రూపాయలు ఉన్న పెన్షన్ ను తన తనయుడు ఈ రోజు 3000 లు చేసిన గొప్ప మనసున్న నాయకుడమ్మ జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. జగన్ అన్ని రాష్ట్రాలలో కంటే ఎపిలో భిన్నమైన పాలనను ప్రజలకు అందిస్తున్నారన్నారు. ఐదు లక్షలు నున్న వైఎస్సార్ ఆరోగ్య శ్రీ ని 25 లక్షలకు పెంచి పేదలకు అండగా నేనున్నానని సీఎం జగన్ భరోసా కల్పించారన్నారు. అనంతరం వారు లబ్దిదారులకు పెంచిన రూ 3000 పెన్షన్ లను అందజేశారు. మరణించిన మున్సిపల్ కార్మికుల కుటుంబ సభ్యులకు రెండు లక్షలు రూపాయల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ వండాడి వెంకటేశ్వర్లు, మున్సిపల్ కౌన్సలర్లు, వైకాప నాయకులు,మున్సిపల్ ఆర్ ఐ మల్లికార్జున వారి సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు, వాలింటర్లు, లబ్దిదారులు పాల్గొన్నారు.
ఇచ్చిన హామీలను వంద శాతం నెరవేర్చిన సీఎం…
98
previous post