68
శ్రీకాకుళం జిల్లా.. పలాసలో అంగన్వాడీలు కదం తొక్కారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన సమ్మె 20 రోజులకు చేరుకుంది. ఈ నేపథ్యంలో మంత్రి సీదిరి అప్పలరాజు ఇంటిని ముట్టడించారు. వేలాదిమంది అంగన్వాడీలు మంత్రి ఆఫీసు గేట్లను తోసుకుంటూ వెళ్లి అక్కడ బైఠాయించి తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడి లు మాట్లాడుతూ 20 రోజులుగా నిద్రాహారాలు మాని రాష్ట్రవ్యాప్తంగా లక్షల్లో అంగన్వాడీలు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలియజేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు ఈ పోరాటం కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Read Also..