పల్నాడు జిల్లా(Palnadu)…
సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో పలు అభివృద్ధిపనులు ప్రారంభించిన మంత్రి అంబటి రాంబాబు, బాపట్ల ఎంపీ నందిగామ సురేష్, నరసరావుపేట పార్లమెంటు ఇంచార్జ్ అనిల్ కుమార్ యాదవ్(Anil Kumar Yadav).
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
అనిల్ కుమార్ యాదవ్ కామెంట్స్ | Anil Kumar Yadav Comments…
పల్నాడు(Palnadu)లో గెలవకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఒక సామాన్యుడిని ఎక్కడికైనా తీసుకపోగలిగే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఒక సామాన్యుడిని ఎక్కడి నుంచైనా పోటీ చేయగలిగేలా చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు రా కదలిరా అంటూ జనాలు రాని సభలో కొన్ని మాటలు మాట్లాడాడు.
లావు శ్రీకృష్ణదేవరాయలు ని గంజాయి వనంలో నుంచి తులసివనంలోకి ఆహ్వానిస్తున్న అన్నాడు. చంద్రబాబు నాయుడు(Chandra Babu) ని సూటిగా ఒకటే అడుగుతున్నాను. మా ఎంపీ సోదరుడికి నరసరావుపేట టిక్కెట్ ఇచ్చి ఉంటే ఇక్కడ నుంచి పోటీ చేసేవాడు కాదా అని అడుగుతున్నాను. జగనన్న ఇక్కడ ఇవ్వలేదు కాబట్టే నీ గడప ఎక్కాల్సిన అవసరం వచ్చింది.
ఇది మీ గొప్పతనమా, మీ పార్టీ గొప్పతనమా కేవలం స్వార్థం. మాకు ఉంది స్వార్థం, జగన్మోహన్ రెడ్డి గుండెల్లో నిలబడలి బడుగు బలహీన వర్గాలు అనే స్వార్థం. వైసీపీ టికెట్ ఇవ్వలేదు కాబట్టి అక్కడికి వెళ్లి పల్నాడు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు అన్న మాటలు బాదేసాయి. చిన్నోడిని బలహీనవర్గాల వాడిని.
14 సంవత్సరాలు ముఖ్య మంత్రి చేసిన వ్యక్తి, నెల్లూరులో నా పేరే పల్నాడులో నా పేరు, నా గురించే మాట్లాడుతున్నాడు నా స్థాయి పెరిగింది. జగన్మోహన్ రెడ్డి అక్కడ తంతే ఇక్కడ పడ్డానంట, ఇక్కడ తంతే నేను చెన్నైకి పోతాను అంట.
2019లో ఆరు నెలల ముందే ప్రజల తంతారు అని చెప్పి హైదరాబాద్ పారిపోయావు నువ్వు నాకు నా గురించి మాట్లాడతావా. నెల్లూరులో రెండుసార్లు గెలిచా అక్కడ బుల్లెట్ దింపా ఇక్కడ కూడా దింపుతా. వదిలేదే లేదు, అనిల్ ని వదలను జగన్మోహన్ రెడ్డిని వదలను అన్నాడు చంద్రబాబు. మీ తాటాకు చప్పట్లు భయపడే వ్యక్తిని కాదు.
2019లో నామీద కేసులు పెట్టారని బురదచల్లాలని తలకిందులుగా ప్రయత్నం చేసి టచ్ కూడా చేయలేకపోయావు. నెల్లూరులో ఏమీ లేనప్పుడే కొండన్న పగలాలి నేనన్న చావాలని పనిచేసిన వాడిని.
అనిల్ రౌడీ… నేను రౌడీనో గుండానో. 43 ఏళ్లు నాకు ఇంకా 17 సంవత్సరాలు రాజకీయ జీవితం ఉంది. శత్రువుకు కూడా సాయం చేసే గుణం నాది. సామాన్యుడిని.. తండ్రి లేని బిడ్డగా రాజకీయాల్లోకి వచ్చా,
తాత ముఖ్యమంత్రి, తండ్రి పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి కానీ కొడుకును కూడా గెలిపించుకోలేని చేతకానివాడు చంద్రబాబు. నువ్వు ఏడ పుట్టావో నీ కొడుకేడ పుట్టాడో నీ సొంత ఊరు ఏది? పోటీ మంగళగిరిలో చేశాడు. నువ్వు నీ కొడుకు చేత ఈ సవాల్ స్వీకరించు పల్నాడులో గాని ఓడిపోతే రాజకీయాల్లో నుంచి తప్పుకుంటా.
నరసరావుపేట నుంచి ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా ఇది నా సవాల్. నువ్వు గాని, నీ కొడుకు గాని నా సవాల్ స్వీకరించే దమ్ముందా అని అడుగుతున్నా. 70 సంవత్సరాల తర్వాత ఒక బీసీ బిడ్డకు ఇచ్చిన అవకాశం.
అనిల్ ఇక్కడ చరిత్ర రాస్తాడు…
15 సంవత్సరాలు ఇటుక ఇటుక పెంచుకొని ఉన్న జిల్లానే, అన్న మాట కోసమే ఇక్కడికి వచ్చి పోటీ చేస్తున్నా. నీకు చిత్తూరు పౌరుషం ఉంటే రాయలసీమ పౌరుషం ఉంటే నా సవాల్ స్వీకరించు. నువ్వు కాకపోతే నీ కొడుకు తో స్వికరించు నీ రక్తంలో రాయలసీమ పౌరుషం ఉంటే సవాల్ స్వీకరించు. జగన్మోహన్ రెడ్డి గుండెల్లో నుంచి వచ్చిన వాళ్ళు బీసీలు ఎస్సీలు మేము భయపడం. అనిల్ ఆవేశంతోను అహంకారంతో చెప్పటం లేదు ఆత్మవిశ్వాసంతో చెబుతున్నా. నీ పార్టీకి అభ్యర్థులే లేరు, మేం గుంటూరుకి వెళ్లమన్న అభ్యర్థిని నరసరావుపేటకు తీసుకున్నావు. మీ పార్టీకి అభ్యర్థులే లేరు.
మేము టిక్కెట్ ఇస్తే వీళ్లంతా మా పార్టీ తరుపున పోటీ చేసేవాళ్లే.. మీ పార్టీ మీద ప్రేమ ఉండి వచ్చారా లేదా నీ అందాన్ని చూసి వచ్చారా లేదా నీ కొడుకు అందాన్ని చూసి వచ్చారా… ఈడ కాకపోతే ఆడ కాకపోతే అంతే.. 77 పార్లమెంట్ కూడా గెలుస్తాం. చంద్రబాబు నాయుడు కి లోకేష్(Lokesh) కి నా సవాల్. లోకేష్ అబ్బ ముఖ్యమంత్రి వాళ్ళ తాత ముఖ్యమంత్రి కావచ్చు, వాడు మాత్రం ఏమీ కాలేడు. లోకేష్ ని వాళ్ల అబ్బ, తాత కూడా గెలిపించలేకపోయారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి