శ్రీ భ్రమరాంబికాదేవి అమ్మవారికి వార్షిక కుంభోత్సవం…

Annual Kumbhotsav for Goddess Sri Bhramarambikadevi

Advertisements

&NewLine;<p>శ్రీశైలం శ్రీ భ్రమరాంబికాదేవి అమ్మవారికి ఏప్రిల్ 26 à°¨ వార్షిక కుంభోత్సవం దేవస్థానం నిర్వహించనుంది&period; ఈ నేపద్యంలో చైత్రమాసం పౌర్ణమి తర్వాత వచ్చే మంగళవారం గాని శుక్రవారం గాని ఏది ముందుగా వస్తే ఆరోజున కుంభోత్సవం నిర్వహించడం దేవస్థానం ఆనవాయితీ అలానే ఈ సంవత్సరం జరిగే కుంభోత్సవానికి సాత్విక బలిగా కుంభోత్సవానికి ఆరంభ ప్రతీకగా దేవస్థానం ఆధ్వర్యంలో కొబ్బరి&comma; గుమ్మడి&comma; నిమ్మకాయలు సమర్పించారు&period; దేవస్థానం ఆనవాయితీ ప్రకారం నేడు శుక్రవారం కావడంతో ఉదయం శ్రీ స్వామివారి ఆలయంలో విధులు నిర్వహించే ఉద్యోగి అమ్మవారికి కుంభహారతి ఇవ్వడం జరిగింది&period; అయితే మహా శివరాత్రి తర్వాత వచ్చే ప్రతి మంగళ&comma; శుక్రవార రోజుల్లో కొబ్బరికాయలు రాశులుగా పోసి&comma; పసుపు&comma; కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి సింహ మండపం వద్ద సాత్విక బలి సమర్పించడంతో లోక కల్యాణం జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు&period; అలానే ఏప్రిల్‌ 26à°¨ అమ్మవారికి వార్షిక కుంభోత్సవం ఘనంగా నిర్వహిస్తునట్లు దేవస్థానం ఈవో పెద్దిరాజు తెలిపారు&period; ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు&comma; అర్చకులు&comma; సిబ్బంది పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష.

పవన్ కళ్యాణ్‌పై జడ శ్రవణ్ కుమార్‌ చేసిన వ్యాఖ్యలపై జనసేన ఫిర్యాదు.

నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో యువతికి ఎమ్మెల్యే ప్రశంసలు.