ముంబై ఇండియన్స్ (Mumbai Indians) :
ఐపీఎల్ 2024 (IPL 2024)లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. చంఢీగఢ్ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై 9 పరుగులు తేడాతో ఘనవిజయం సాధించింది. 193 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన పంజాబ్ 183 పరుగులకు ఆలౌట్ అయ్యింది. పంజాబ్ యువ బ్యాటర్ అశుతోశ్ శర్మ అద్భుతంగా పోరాడినప్పటికీ విజయం ముంబైనే వరించింది. 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన స్థితిలో అశుతోశ్ శర్మ తన జట్టు గెలుపు ముంగిటకు తీసుకొచ్చాడు. 28 బంతుల్లో 61 పరుగులు బాదాడు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
అందులో ఏకంగా 7 సిక్సర్లు ఉన్నాయి. అయితే చివరిలో అతడు ఔట్ కావడంతో పంజాబ్‌కు ఓటమి తప్పలేదు. ముంబై బౌలర్లలో కోయిట్జి, బుమ్రా, ఆకాశ్ మధ్వల్ తలో మూడు వికెట్లు తీయగా.. ఒక వికెట్ రనౌట్ రూపంలో లభించింది. పంజాబ్ బ్యాటర్లలో సామ్ కర్రాన్ 6, ప్రభ్సిమ్రాన్ సింగ్ 0, రూసో 1, లియామ్ లివింగ్‌స్టోన్ 1, హర్‌ప్రీత్ సింగ్ భాటియా13, శంకర్ సింగ్ 41, జితేశ్ శర్మ9, ఆశ్‌తోశ్ శర్మ 61, హర్‌ప్రీత్ బ్రార్ 19, కగిసో రబాడ 8 అర్షదీప్ సింగ్ 1 చొప్పున పరుగులు చేశారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపంపసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది. దేశంలో అతిపెద్ద నగరమైన పోర్ట్ విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.…
- డొనాల్డ్ ట్రంప్ కు హష్ మనీ కేసులో ఎదురుదెబ్బఅమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు న్యూయార్క్ కోర్టు భారీ షాకిచ్చింది. హష్ మనీ కేసులో ఇప్పటికే ట్రంప్ ను దోషిగా తేల్చగా.. ఈ కేసు నుంచి రక్షణ కోరుతూ ట్రంప్ దాఖలు చేసిన పిటిషన్ ను…
- డే లైట్ సేవింగ్ టైమ్ ను రద్దు చేస్తాం – ట్రంప్అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు అసౌకర్యంగా మారిన డే లైట్ సేవింగ్ టైమ్ ను రద్దు చేయనున్నట్లు ప్రకటించారు. డే లైట్ సేవింగ్ టైమ్ వల్ల అమెరికన్లపై చాలా భారం…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: ముంబై ఇండియన్స్ ఖాతాలో మరో విజయం…