సాధారణ ఎన్నికలకు ముందు మూడు ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ఏపి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాలలున్న మూడు యాజమాన్యాలు బ్రౌన్‌ఫీల్డ్ ప్రైవేటు విశ్వవిద్యాలయం ఏర్పాటుకు చేసిన దరఖాస్తులకు సీఎం జగన్ ఆమోదించారు. కాకినాడ జిల్లా సూరంపాలెంలోని శేషారెడ్డికి చెందిన ఆదిత్య విద్యాసంస్థలు, అన్నమయ్య జిల్లాలోని గంగిరెడ్డికి చెందిన అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాల, రాజమహేంద్రవరంలోని కేవీవీ సత్యనారాయణరాజు – చైతన్యరాజుకు చెందిన గోదావరి ఇంజినీరింగ్ కళాశాలలను బ్రౌన్‌ఫీల్డ్ ప్రైవేటు విశ్వవిద్యాలయాలుగా మార్చుకునేందుకు ప్రభుత్వం ఆమోదించింది. ఇప్పటివరకున్న నిబంధనల ప్రకారం ప్రస్తుతమున్న కళాశాలల్లో 70 శాతం సీట్లతోపాటు కొత్తగా ఏర్పడిన విశ్వవిద్యాలయంలో తీసుకొచ్చే కోర్సుల్లో 35 శాతం సీట్లను కన్వీనర్ కోటాకు కేటాయించాల్సి ఉంటుంది. ఈనెల 5వ తేదీ నుంచి నిర్వహించనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ మూడు ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు సంబంధించిన బిల్లులను ప్రవేశపెట్టనున్నారు.
3 ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
144
previous post