సింగపూర్ లో మంత్రి లోకేష్ పర్యటన..

సింగపూర్ లో మంత్రి లోకేష్ పర్యటన

Advertisements

<p>ఆంధ్రప్రదేశ్ ఐటీ&comma; విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సింగపూర్‌లో బిజీబిజీగా పర్యటిస్తున్నారు&period; రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆయన పలు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు&comma; ప్రభుత్వ విభాగాలతో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు&period; పర్యటనలో భాగంగా ఉదయం సింగపూర్ వాణిజ్య&comma; పరిశ్రమల మంత్రిత్వ శాఖ కార్యాలయంలో జరిగిన జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో లోకేష్ పాల్గొన్నారు&period; ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక సదుపాయాల కల్పన&comma; పట్టణాభివృద్ధి ప్రాజెక్టుల్లో సింగపూర్ భాగస్వామ్యంపై ఈ సందర్భంగా సుదీర్ఘంగా చర్చించారు&period; మధ్యాహ్నం కమోడిటీస్ ఇంటెలిజెన్స్ సెంటర్ సీఈవో&comma; సీఎఫ్‌ఓలతో భేటీ కానున్న మంత్రి&comma; సాంకేతిక రంగంలో ఏపీలో ఉన్న అవకాశాలను వారికి వివరించనున్నారు&period; అనంతరం ప్రముఖ డిజైనింగ్ సంస్థ డీపీ ఆర్కిటెక్ట్స్ ప్రతినిధులతో సమావేశమై స్మార్ట్ సిటీ ప్లానింగ్&comma; అమరావతి అభివృద్ధిపై చర్చించనున్నారు&period; ఏపీ నుంచి వెళ్లిన ప్రభుత్వ ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని కూడా పర్యవేక్షిస్తూ&comma; అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పాలన&comma; విద్యను రాష్ట్రానికి అందించడమే లక్ష్యంగా లోకేష్ ఈ పర్యటనను కొనసాగిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..