ఓఆర్‌ఆర్‌పై ఘోర ప్రమాదం.. యువ నటుడు, కెమెరామెన్ దుర్మరణం..

ఓఆర్‌ఆర్‌పై ఘోర ప్రమాదం.. యువ నటుడు, కెమెరామెన్ దుర్మరణం

Advertisements

<p>తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది&period; హైదరాబాద్ శివారులోని ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వర్ధమాన నటుడు భరత్ కాంత్ &comma; యువ సినిమాటోగ్రాఫర్ త్రిలోక్ దుర్మరణం పాలయ్యారు&period; ఇప్పుడిప్పుడే కెరీర్‌లో ఎదుగుతున్న ఇద్దరు స్నేహితులు ఒకేసారి ప్రాణాలు కోల్పోవడం సినీ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది&period; ఆదిభట్ల పోలీసుల కథనం ప్రకారం నెల్లూరుకు చెందిన భరత్ కాంత్&comma; త్రిలోక్ ప్రాణ స్నేహితులు&period; తమ సొంత ఊరి నుంచి కారులో హైదరాబాద్‌కు బయలుదేరారు&period; పెద్ద అంబర్‌పేట్ వద్ద ఓఆర్‌ఆర్‌పైకి ఎక్కి శంషాబాద్ వైపు వెళ్తుండగా&comma; బొంగుళూరు ఎగ్జిట్ 12 వద్ద వీరి కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న ఓ కంటైనర్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది&period; ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది&period; ఈ ఘటనలో భరత్&comma; త్రిలోక్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు&period; సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని&comma; మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు&period; అతివేగమే ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు&period; భరత్ &OpenCurlyQuote;టెనెంట్’ సినిమాలో హీరోగా నటించగా&comma; త్రిలోక్ పలు చిత్రాలకు కెమెరామెన్‌గా పనిచేస్తూ మంచి గుర్తింపు పొందారు&period; భరత్ కాంత్ మృతిపై నటి అషురెడ్డి సోషల్ మీడియాలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు&period; &&num;8220&semi;నా ప్రాణ స్నేహితుడిని కోల్పోయాను&&num;8221&semi; అంటూ ఆమె పెట్టిన పోస్ట్ పలువురిని కంటతడి పెట్టిస్తోంది&period; ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

దూరదర్శని చూసిన ప్రేక్షకులకు వాళ్ల సొంతూరికి వెళ్లిన ఫీల్‌ కలుగుతుంది..

యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో కబేళాలకు తరలిస్తున్న ఆవుల పట్టివేత…

మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్‌ రెచ్చిపోయిన మరో నేపాలీ ముఠా …..