పంచదార్ల కొండను నాన్‌మైనింగ్ జోన్‌గా మార్పు – కొల్లు.

Advertisements

<p>అనకాపల్లి జిల్లాలోని చారిత్రక పంచదార్ల కొండను నాన్ మైనింగ్ జోన్‌గా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు&period; సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌తో కలిసి ఆయన మాట్లాడారు&period; గత జిల్లా అభివృద్ధి సమీక్షా మండలి సమావేశంలోనే జిల్లాలోని ప్రజాప్రతినిధులందరి ఏకాభిప్రాయంతో ఈ మేరకు తీర్మానం చేశామని మంత్రి తెలిపారు&period; పంచదార్ల కొండపై ఇప్పటివరకు జరిగిన మైనింగ్‌పై పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నామని&comma; విచారణ నివేదిక రాగానే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు&period; ఈ ప్రాంత ప్రాధాన్యతను దృష్ట్యా దీనిని రిజర్వ్ ఫారెస్ట్ జోన్‌గా మార్చడంతో పాటు ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా &lpar;ASI&rpar;కి అప్పగించేందుకు అవసరమైన చర్యలు వేగవంతం చేశామని వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నాకు, అఖిల్, చైతన్యకి పండగలా ఉంది. బ్లాక్ బస్టర్ వైభవం ఈవెంట్‌‌లో అక్కినేని నాగార్జున.

నమాచిలోని హైడ్రో ప్రాజెక్టు టన్నెల్లో ఘోరప్రమాదం.

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ విజేతగా స్పెయిన్.