కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం.

కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం

Advertisements

<p>రాష్ట్రంలో నమోదవుతున్న కోవిడ్ కేసుల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది&period; మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు పరీక్షల కిట్లు&comma; మందులు&comma; ప్రత్యేక పడకలు&comma; రక్షణ సామగ్రి&comma; అత్యవసర ఔషధాలను అందుబాటులో ఉంచేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి&period; ఈ మేరకు వైద్య&comma; ఆరోగ్య శాఖ కార్యదర్శి వీరపాండియన్ అధికారులతో వర్చువల్ సమీక్ష నిర్వహించి సన్నద్ధతపై చర్చించారు&period; కోవిడ్ ను సమర్థంగా ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని&comma; గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని దశల వారీ కార్యాచర ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను కార్యదర్శి ఆదేశించారు&period;<&sol;p>&NewLine;<p>రాష్ట్రంలోని 17 బోధనాసుపత్రుల్లో మొత్తం 255 ప్రత్యేక కోవిడ్ పడకలను సిద్ధం చేశారు&period; బోధనాసుపత్రుల్లో 6లక్షల77వేల936 ట్రిపుల్ లేయర్ మాస్కులు&comma; కేంద్ర డిస్పెన్సరీల్లో మరో 5&period;26 లక్షల మాస్కులు ఉన్నాయి&period; అదనంగా 58వేల790 ఎన్-95 మాస్కులు&comma; 4వేల436 పీపీఈ కిట్లు&comma; 2వేల572 శానిటైజర్లు అందుబాటులో ఉంచారు&period; కోవిడ్ చికిత్సకు అవసరమైన యాంటీబయాటిక్స్&comma; ఐవీ ఫ్లూయిడ్స్ తదితర మందుల నిల్వలు కూడా తగిన స్థాయిలో ఉన్నాయని అధికారులు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జనరిక్ మెడిసిన్ దిగుమతులపై ట్రంప్ కీలక ప్రకటన.

సి.వి.రావును కలిసిన సినీ నిర్మాత, కాంగ్రెస్‌ నేత బండ్ల గణేష్.

రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన.