Wednesday, July 22, 2026
News Navigation
Wednesday, July 22, 2026
News Navigation

Breaking

Wednesday, July 22, 2026
Home Andhra Pradesh కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం.

కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం.

by CVR NEWS
కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం

రాష్ట్రంలో నమోదవుతున్న కోవిడ్ కేసుల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు పరీక్షల కిట్లు, మందులు, ప్రత్యేక పడకలు, రక్షణ సామగ్రి, అత్యవసర ఔషధాలను అందుబాటులో ఉంచేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి వీరపాండియన్ అధికారులతో వర్చువల్ సమీక్ష నిర్వహించి సన్నద్ధతపై చర్చించారు. కోవిడ్ ను సమర్థంగా ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని దశల వారీ కార్యాచర ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను కార్యదర్శి ఆదేశించారు.

రాష్ట్రంలోని 17 బోధనాసుపత్రుల్లో మొత్తం 255 ప్రత్యేక కోవిడ్ పడకలను సిద్ధం చేశారు. బోధనాసుపత్రుల్లో 6లక్షల77వేల936 ట్రిపుల్ లేయర్ మాస్కులు, కేంద్ర డిస్పెన్సరీల్లో మరో 5.26 లక్షల మాస్కులు ఉన్నాయి. అదనంగా 58వేల790 ఎన్-95 మాస్కులు, 4వేల436 పీపీఈ కిట్లు, 2వేల572 శానిటైజర్లు అందుబాటులో ఉంచారు. కోవిడ్ చికిత్సకు అవసరమైన యాంటీబయాటిక్స్, ఐవీ ఫ్లూయిడ్స్ తదితర మందుల నిల్వలు కూడా తగిన స్థాయిలో ఉన్నాయని అధికారులు తెలిపారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

042266
Total views : 223654

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: