ఆటో మోటర్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్నా నిందితులను జనగామ పోలీసులు అరెస్టు చేసారు. నిందితుల నుండి స్వాధీనం చేసుకున్న రెండు బజాజ్ ఆటోలు, రెండు మోటార్ సైకిల్ వాటి విలువ 730000 వెస్ట్ జోన్ డీసీపీ సీతారాం మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ కి చెందిన నలుగురు వ్యక్తులు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. జల్సాలకు అలవాటు పడి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వరుస దొంగతనాలకు పాల్పడుతూ 2022, 2023 సంవత్సరంలో బంజారాహిల్స్ మేడిపల్లి చిలకలగూడ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతుండగా పోలీసులు అరెస్ట్ చేసి చంచలగూడ జైలుకు తరలించారు. జైలు నుంచి వచ్చాక మరల జల్సాలకు అలవాటు పడి మూడు రోజుల క్రితం నలుగురు బస్సులో జనగామ వచ్చి జనగామ నగరంలో ఇంటి ముందు పార్కు చేసి ఉన్న బజాజ్ ఆటోను, పెంబర్తి గ్రామంలో మరో ఆటోను తీసుకొని వెళ్లి నిర్మానుస్య ప్రాంతంలో పెట్టి హైదరాబాద్ వెళుతున్న క్రమంలో పెంబర్తి వై జంక్షన్ వద్ద జనగామ పోలీసులు తనిఖీ చేస్తూ ఉండగా పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన జనగామ పోలీసులను డిసిపి సీతారాం అభినందించారు.
107
previous post