విజయవాడ, సీఎం జగన్ పై రాళ్ల దాడి వెనుక వాళ్ళ హస్తం ఉందా | Attack on CM Jagan
సెంట్రల్ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి యాత్ర. సింగ్ నగర్ లో జగన్ పై రాయి గుర్తు తెలియని వ్యక్తి. జగన్ తలకు స్వల్ప గాయం. బస్సులోనే ప్రధమ చికిత్స చేసిన వైద్యులు. యాత్రను యధావిధిగా కొనసాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి. విజయవాడ “మేమంతా సిద్ధం” (Memantha Siddham)బస్సుయాత్రలో సీఎం జగన్ పై దాడి. సీఎం జగన్ పై రాయితో దాడి. బస్సుపై నుంచి సీఎం జగన్(CM Jagan) ప్రజలకు అభివాదం చేస్తున్నప్పుడు దాడి. అత్యంత వేగంగా సీఎం జగన్ కనుబొమ్మకు తాకిన రాయి. సీఎం జగన్ పై క్యాట్ బాల్ తో దాడి చేసినట్లు అనుమానం. రాయి తగలడంతో సీఎం జగన్ ఎడమకంటి కనుబొమ్మపై గాయం. సీఎం జగన్ పక్కనే ఉన్న MLA వెల్లంపల్లి ఎడమ కంటికిసైతం గాయం. వెంటనే సీఎం జగన్ కు బస్సులో ప్రథమ చికిత్స అందించిన వైద్యులు. ప్రథమ చికిత్స తర్వాత మళ్లీ బస్సుయాత్ర కొనసాగిస్తున్న సీఎం జగన్.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
విజయవాడలో సీఎం జగన్ కోసం పోటెత్తిన జనం. విజయవాడ సిటీలో మూడున్నర గంటలుగా.. అప్రతిహతంగా కొనసాగుతున్న భారీ రోడ్ షో. సీఎం జగన్ కు వస్తున్న ప్రజాభిమానాన్ని ఓర్వలేకే.. టీడీపీ వర్గాలే దాడికి తెగబడ్డారంటున్న విజయవాడ YSRCP నేతలు. అయితే ఈ దాడి వెనుక టీడీపీ కార్యకర్తలు ఉన్నారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సింగ్నగర్లో ఓ ప్రముఖ టీడీపీ నేత ఆఫీస్ దగ్గరే ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఆయనపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జగన్ బస్సు యాత్ర సమయంలో టీడీపీ శ్రేణులు భారీగా అక్కడకు చేరుకుని ఆయనపై దాడికి పాల్పడినట్టు సమాచారం. కరెంట్ లేని సమయం చూసి సీఎం జగన్పై ఆగంతకులు దాడికి పాల్పడినట్టుగా తెలుస్తోంది.
ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. దాడి జరిగిన ప్రాంతంలో ఉన్న ప్రజలతో పాటు,అక్కడున్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. గాయం అయిన కంటికి చికిత్స తీసుకున్న అనంతరం జగన్ తన బస్సు యాత్రను కొనసాగిస్తున్నారు. అయితే ఆయన కంటికి కుట్లు పడే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. గుంటూరు జిల్లాలో బస్సు యాత్రను ముగించుకుని ఉమ్మడి కృష్ణాజిల్లాలో అడుగుపెట్టిన తొలిరోజే ఈ ఘటన చోటు చేసుకుంది. జగన్కు వస్తోన్న ఆదరణ తట్టుకోలేక కడుపు మంటతోనే ఈ దాడి చేశారని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: సీఎం జగన్ పై రాళ్ల దాడి…ఆ నేత పై అనుమానాలు