88
ప్రజా ఓటుతో కాకుండా మోసపూరితమైన ఓటుతో వైకాపా మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తుందని ప్రకాశం జిల్లా మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆరోపించారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. నియోజకవర్గాల్లో వేలకు వేలు తెదేపా సానుభూతి పరుల ఓట్లు ఫారం 7 ద్వారా తొలగించేందుకు వైకాపా నాయకులు కుట్ర చేసేందుకు సిద్ధమవుతున్నారని నారాయణరెడ్డి అన్నారు. వైకాపా నాయకుల మాటలకు అధికారులు తలోగ్గి ఓట్లు తొలగించే కార్యక్రమం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. నిజమైన ఓటరు ఎక్కడున్నా వచ్చి ఓటు వేసుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.