సైబరాబాద్ సీపీ గా బాధ్యతలు స్వీకరించిన అవినాష్ మహంతి మీడియాతో మాట్లాడుతూ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కీలకమైన సంస్థలు ఉన్నాయని, నిష్పక్షపాతంగా ప్రజలకు సేవ చేయడంతో పాటు చట్టబద్ధంగా పని చేస్తామని అన్నారు. మా వద్ద ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ భద్రత, రక్షణ ఇవ్వడానికి ప్రయత్నిస్తామని అతిపెద్ద సమస్యగా మారిన సైబర్ క్రైమ్స్ పై ప్రత్యేక దృష్టి పెడతామని అన్నారు. అన్ని రకాల కేసులను నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తామని, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూస్తామని, ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించడానికి కొత్తగా ప్రణాళికలు సిద్ధం చేస్తామని అన్నారు. రెగ్యులర్ క్రైమ్స్ పై దృష్టి సారిస్తామని, డ్రగ్స్ పై ప్రత్యేక నిఘా ఉంచడమే కాకుండా డ్రగ్స్ ఎక్కడి నుండి వస్తున్నాయన్న అంశాలపై విచారణ చేస్తామని అన్నారు. 31 డిసెంబర్ రోజున వేడుకలు పోలీస్ నిబంధనలకు అనుగుణంగా జరుపుకోవాలని పబ్బులు, ఫామ్ హౌస్ లపై అసాంఘిక, కార్యకలాపాలపై నిఘా పెడతామని ఆయన అన్నారు.
అవినాష్ మహంతి హాట్ కామెంట్స్….
79
previous post