90
తిరుపతి, ఆర్డీవో సుజనా, మున్సిపల్ కమిషనర్ కే ఎల్ ఎన్ రెడ్డిఆధ్వర్యంలో పుత్తూరు పట్టణంలో ఓటు హక్కు పై అవగాహన, ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నగిరి ఆర్డీవో సృజన పాల్గొన్నారు.అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. కుల, మత, లింగ, జాతి, భాష, అనే బేధం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాల నిండిన పౌరులందరికీ ఓటు వేసే బాధ్యత, హక్కు,భారత రాజ్యాంగం ఆర్టికల్ 320 ద్వారా కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.