94
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజయరామరాజు పేర్కొన్నారు. 14 వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కడప నగరంలోని కోటిరెడ్డి సర్కిల్లో అవగాహన ర్యాలీనీ జెండా ఊపి ప్రారంభించిన సందర్బంగా ఆయన తెలిపారు. ఇప్పటికే అన్ని పార్టీల రాజకీయ నాయకులతో ఎన్నికలకు సంబంధించి అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన చెప్పారు. అవగాహన ర్యాలీ కోటి రెడ్డి సర్కిల్, సంధ్య సర్కిల్ మీదుగా కొనసాగింది. అనంతరం మహావీర్ సర్కిల్ లో మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గణేష్, మున్సిపల్ కమిషనర్ సూర్య సాయి ప్రవీణ్ చంద్, ఆర్డీవో మధుసూధన్, కడప తహశీల్దార్ శివ రామిరెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.