సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో శ్రీరామ జన్మభూమి అయోధ్యనందు పూజింపబడిన అక్షింతల ఎదుర్కోలు శోభాయాత్ర కార్యక్రమాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. స్థానిక గోదాం గడ్డ హనుమాన్ దేవాలయం నుండి, మార్కండేయ దేవాలయం వరకు శ్రీరామ ఉత్సవ మూర్తిని, శ్రీరామ అక్షింతలను ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఊరేగింపు కార్యక్రమంలో భక్తులు, ప్రముఖులు పాల్గొని కోలాటాలతో ఆడి పాడి అలరించారు.
జై శ్రీరామ్ అంటూ నినాదిస్తూ ఊరేగింపుగా తరలి వెళ్లారు. హుస్నాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ రజిత, ప్రముఖులు శోభాయాత్రలో పాల్గొని శ్రీరామ ఉత్సవమూర్తిని తీసుకెళ్తున్న పల్లకిని భుజాలపై ఎత్తుకున్నారు. వచ్చే ఏడాది 2024 జనవరి 1 నుండి 15 వరకు ప్రతి ఇంటికి శ్రీరామ స్పర్శ అక్షింతలు, అయోధ్య రామ మందిర చిత్రం, ఆహ్వాన పత్రం వితరణ కార్యక్రమం చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
అయోధ్య అక్షింతల శోభాయాత్ర కార్యక్రమం..
125
previous post