సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో శ్రీరామ జన్మభూమి అయోధ్యనందు పూజింపబడిన అక్షింతల ఎదుర్కోలు శోభాయాత్ర కార్యక్రమాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. స్థానిక గోదాం గడ్డ హనుమాన్ దేవాలయం నుండి, మార్కండేయ దేవాలయం వరకు శ్రీరామ ఉత్సవ మూర్తిని, శ్రీరామ అక్షింతలను ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఊరేగింపు కార్యక్రమంలో భక్తులు, ప్రముఖులు పాల్గొని కోలాటాలతో ఆడి పాడి అలరించారు.
జై శ్రీరామ్ అంటూ నినాదిస్తూ ఊరేగింపుగా తరలి వెళ్లారు. హుస్నాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ రజిత, ప్రముఖులు శోభాయాత్రలో పాల్గొని శ్రీరామ ఉత్సవమూర్తిని తీసుకెళ్తున్న పల్లకిని భుజాలపై ఎత్తుకున్నారు. వచ్చే ఏడాది 2024 జనవరి 1 నుండి 15 వరకు ప్రతి ఇంటికి శ్రీరామ స్పర్శ అక్షింతలు, అయోధ్య రామ మందిర చిత్రం, ఆహ్వాన పత్రం వితరణ కార్యక్రమం చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Shobhayatra
రాజమండ్రి గైట్ మైదానంలో జనవరి 5 6 7 తేదీలలో అంతర్జాతీయ తెలుగు మహాసభలను నిర్వహించనున్నట్లు గజల్ శ్రీనివాస్ తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం అల్లూరి సాంస్కృతిక కళాక్షేత్రం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన శ్రీనివాస్ మాట్లాడారు. ఆంధ్ర సర్వహక పరిషత్ చైతన్య విద్యాసంస్థలు సంయుక్తంగా అత్యంత వైభవంగా అంతర్జాతీయ మహాసభలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ మహాసభలలో నాలుగు రాష్ట్రాలకు చెందిన గవర్నర్లు ఇద్దరు కేంద్రమంత్రులతోపాటు ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రి లకు ఆహ్వానం పంపినట్లు ఆయన తెలిపారు. లక్ష మంది వరకు తెలుగు భాషాభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ఉచిత భోజన సదుపాయం వసతి ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. జనవరి 2 తేదీన పదివేల మంది విద్యార్థిని, విద్యార్థులతో రాజమండ్రిలో శోభయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆయా ప్రాంతాల్లో ఉన్న తెలుగు వారందరూ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
Read Also..
Read Also..






Total views : 75478