Saturday, September 12, 2026
News Navigation
Saturday, September 12, 2026
News Navigation

Breaking

Saturday, September 12, 2026
Home Health ఆస్తమాతో బాధపడుతున్నారా.. అయితే ఇలా చెయ్యండి!

ఆస్తమాతో బాధపడుతున్నారా.. అయితే ఇలా చెయ్యండి!

by Satya
asthma

ఈ సమస్య బారిన పడితే ఖచ్చితంగా జీవితాంతం నరకం అనుభవిస్తూ బాధపడాల్సింది ఉంటుంది. ఆస్తమా వ్యాధితో మనలో చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఈ సమస్య ఒక్కసారి వస్తే పోదని జీవితాంతం మందులు వాడాల్సిందేనని చాలా మంది చెబుతూ ఉంటారు. ఈ ఆస్థమా నుండి ఉపశమనాన్ని పొందడానికి మందులను, ఇన్హెలర్ లను వాడుతూ ఉంటారు. అయితే మందులు వాడే అవసరం లేకుండా సహజ పద్దతులతో ఈ సమస్య నుండి ఈజీగా బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలా చెయ్యండి. ఉప్పును తీసుకోకపోవడం వల్ల ఆస్తమా చాలా వరకు తగ్గుముఖం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఉడికించిన ఆహారానికి బదులుగా ఉదయం పూట మొలకెత్తిన గింజలను, జామ కాయ వంటి పండ్లను తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల ఉప్పు లేకపోయినా ఆహారాన్ని తీసుకోవచ్చు. ఇలా పచ్చి ఆహారాలను తీసుకోవడం వల్ల కఫం ఎక్కువగా తయారవ్వకుండా ఉంటుంది. అదే విధంగా సాయంత్రం పూట ఉడికించిన ఆహారాలకు బదులుగా పండ్లను తీసుకోవాలి. ఇలా ఉప్పు లేని ఆహారాలను తీసుకోవడం వల్ల శ్లేష్మం తక్కువగా తయారవుతుంది. ఉప్పు లోటు లేకుండా ఉండడానికి కూరలల్లో నిమ్మరసం పిండి తీసుకోవాలి. అలాగే కూరలను వేడి వేడిగా తీసుకోవాలి. ఇలా ఉప్పు లేని ఆహారాలను తీసుకోవడం వల్ల శ్లేష్మం తక్కువగా తయారవుతుంది. శ్లేష్మం తయారవ్వడానికి ముఖ్య కారణం ఉప్పేనని దీనిని తక్కువగా తీసుకోవడం వల్ల వీలైనంత వరకు ఆస్థమా తగ్గుతుందని వారు చెబుతున్నారు. అలాగే ఉప్పును తక్కువగా తీసుకోవడం వల్ల శ్వాస నాళాలు, గాలి గొట్టాలు ఎక్కువగా వ్యాకోచిస్తాయి. దీంతో ఆయాసం తగ్గుతుంది. ఇలా ఆహారాన్ని తీసుకుంటూనే మొదటి 4 రోజులు మందులను వాడాలి. ఎప్పుడూ కూడా గోరు వెచ్చని నీటిని తాగాలి. అలాగే రోజూ వేడి నీటితో స్నానం చేయాలి. వేడి నీటితో ఆవిరి పట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల కఫం, శ్లేష్మం నుండి ఉపశమనం కలుగుతుంది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: