ఆ రెండు పార్టీలు మహనీయుల పేర్లను వాడుకున్నాయి…

Bandi Sanjay

Advertisements

&NewLine;<p>పి&period;వి నర్సింహారావు లాంటి గొప్ప వ్యక్తికి కేంద్రంలో ఉన్న బీజేపీ&comma; ప్రధాని నరేంద్ర మోడీ భారత రత్న ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని ఎంపి బండి సంజయ్ అన్నారు&period; హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలోని మాజీ ప్రధాని&comma; భారత రత్నపి&period;వి నర్సింహారావు నివాసానికి వెళ్లిన బండి సంజయ్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు&period; పి&period;వి వల్లే కాంగ్రెస్ పార్టీకి ఇంకా మనుగడ ఉందని&comma; కానీ పి&period;వి కి అంత్యక్రియలు కూడా జరపకుండా అవమానించడానికి కారణం ఇప్పటి వరకు తెలియడం లేదన్నారు&period; ఇప్పటి వరకు కూడా పి వి విషయంలో దుర్మార్గపు ఆలోచనలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు&period; ఒక్క పి&period;వి విషయంలో మాత్రమే కాదు&comma; డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ తీరు అంతేనన్నారు&period; మొన్నటి దాకా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ది కూడా అదే ధోరణి అని ఆరోపించారు&period; కాంగ్రెస్&comma; బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా మహనీయులను&comma; వాళ్ళ పేర్లను వాడుకొని రాజకీయం చేయడం తప్ప&period;&period; వాళ్ళను గుర్తించి చేసింది ఏమి లేదని విమర్శించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..