బాపట్ల జిల్లా బాపట్ల పట్టణం లో పత్రికా విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ మాట్లాడుతూ….. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తాయి అయితే 2019 ఎన్నికలలో బాపట్ల నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ కోన రఘుపతి గెలవడం జరిగింది. నేను గత సంవత్సరంన్నర క్రితం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ రోజున బాపట్ల నియోజకవర్గం లో ఎమ్మెల్యే కోన రఘుపతి వల్ల జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, ఇసుక దందాలు గురించి పూర్తి ఆధారాలతో మాట్లాడటం జరిగింది. ఆయనలో ఏమైనా కొంచెం అయినా మార్పు వచ్చిందేమో అనుకుంటే ఏమాత్రం స్పందించలేదు. నేను ఎవరికీ భయపడను ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ మీరు వైసీపీకి సపోర్ట్ చేయకపోతే మీకు వచ్చే పథకాలు కట్ చేస్తామని వాలంటీర్లతో భయపెట్టే పరిస్థితులు ఉన్నాయని ప్రజలు భయపడుతున్నారు. రేపు జరగబోయే 2024 ఎన్నికలలో కోన రఘుపతిని ఇంటికి పంపించడమే నా ధ్యేయం ఎందుకంటే ఇంతటి దుర్మార్గుడు, నమ్మించి మోసం చేసే వ్యక్తి స్తుతి మెత్తనంగా మాట్లాడే వ్యక్తి అతను చేసే అరాచకాలు అన్ని ఇన్ని కావు వైసిపి పార్టీ మరల అతనినే అభ్యర్థిగా ప్రకటిస్తున్నారు. వైసిపి పార్టీ వారికి అతను చేసే తప్పులు చిన్నవిగా ఉన్నట్టున్నది అంటే వారు చేసే తప్పులుతో పోల్చుకుంటే ఇవి చిన్నవిగా ఉండి ఉంటాయి అని అన్నం అన్నారు. బాపట్ల ఎవరు ఏ ఇల్లు కట్టుకోవాలని ఇసుక తోలుకోవాలన్న ఏదైనా షాపు ఓపెన్ చేసుకోవాలన్న నా పర్మిషన్ ఉండాల్సిందే అని ప్రజలను బ్రాంతులకు గురి చేస్తున్న వ్యక్తి కోన రఘుపతి… పట్టణంలో ఇల్లు పగలగొట్టి నాలుగు రోడ్లు వేసి ఇదే అభివృద్ధి అంటావా… ఐదు సంవత్సరాలకు ఒకసారి మీ చేతికి ఒక ఆయుధం వస్తుంది ఆ ఆయుధమే ఓటు దానిని ఉపయోగించి 2024 ఎన్నికలలో కోన రఘుపతిని ఇంటికి పంపించటమే ధ్యేయంగా పెట్టుకోవాలని అన్నం నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు.
రఘుపతిని ఇంటికి పంపించడమే నా ధ్యేయం…
124
previous post