పులివెందులను అబివృద్ధి చేయలేని వ్యక్తి రాష్ట్రాన్ని ఏమి అభివృద్ధి చేస్తాడు..

Bhumireddy Ramgopalreddy

Advertisements

&NewLine;<p>కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురం మండలం మొగమూరు వాగును ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి పరీశీలించారు&period; అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ&period;&period; పులివెందుల అభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయలు మంజూరు చేశారని&comma; డబ్బులు మంజూరు చేసిన వ్యక్తి  ఆ వర్కులు ఏ ప్రోగ్రెస్ లో ఉన్నాయో చూడటం లేదన్నారు&period; విడుదల చేసిన నిధులు ప్రజలకు ఉపయోగపడుతున్నాయా లేదా పర్యవేక్షించాల్సిన వ్యక్తి ఎలాంటి పర్యవేక్షణ చేయడం లేదని ఆయన ఆరోపించారు&period; సీఎం వైఎస్ జగన్ వస్తానే పునాది రాళ్లు వేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలు ఫౌండేషన్ లెవెల్ కూడా దాటలేని స్థితిలో కాంట్రాక్టర్లు ఉన్నారని ఆయన విమర్శించారు&period; మొగమూరు వాగు హిమకుంట్ల నుంచి పాలగిరి వరకు రెండు పక్కల రాళ్లతో రక్షణ గోడ కట్టాల్సి ఉందని&comma; రాతి కట్టడం అక్కడక్కడ కట్టి పూర్తిగా వదిలేశారని ఆయన తెలిపారు&period; వర్షాలు అధికంగా వస్తే ఆ కట్టలు తెగి వర్షపు నీరు పొలాల్లోకి వెళ్లే అవకాశం ఉందని అన్నారు&period; కేంద్ర ప్రభుత్వం పులివెందుల నియోజకవర్గంలో 214 కిలోమీటర్ల రోడ్లు వేయాలని నిధులు మంజూరు చేస్తే&period;&period; ఆ పథకం కింద రెండు కిలోమీటర్ల రోడ్లు కూడా వేయలేని పరిస్థితి ఉందని అన్నారు&period; దాదాపు ఐదు సంవత్సరాలు అవుతున్న రోడ్లు వేయలేదని అసంపూర్తిగా పనులు చేసి విడిచి పెట్టారని ఎమ్మెల్సీ విమర్శించారు&period; గతంలో నీరు చెట్టు కింద చేసిన పనులకు రైతులు పొలాలకు మట్టితోలుకునే à°µà°¾à°Ÿà°¿à°•à°¿ టెండర్లు పిలిచి నిలిపివేశారని అన్నారు&period; ముఖ్యమంత్రి పులివెందులకు కేటాయించిన నిధుల గురించి ప్రతి నెల ముఖ్యమంత్రి ఎంపీ జిల్లా కలెక్టర్&comma; అధికారులు సమీక్ష సమావేశం చేస్తున్నారని&comma; ఎందుకు ఈ మెగమూరు వాగు&comma; రోడ్లు ఎందుకు పూర్తి కాలేదని&comma; ఎందుకు సమీక్షలు చేయలేకపోతున్నారని ఆయన అన్నారు&period; పులివెందులను అబివృద్ధి చేయలేని వ్యక్తి రాష్ట్రాన్ని ఏమి అభివృద్ధి చేస్తాడని ఎమ్మెల్సీ ప్రశ్నించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..