ఎన్డీయే కూటమిలో నరసాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని ఇక్కడ అనేక మంది హేమ హేమిలు తలపడ్డారు. గెలుపొందారని పార్టీలో సీనియర్ నాయకుడిగా ఇంతటి అవకాశం నాకు ఇచ్చిందన్నారు. కేంద్రంలో మోదీ చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుందని, రాష్ట్రంలోఅరాచక పాలన కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని భూపతిరాజు శ్రీనివాస వర్మ భీమా వ్యక్తం చేశారు.
నరసాపురం పార్లమెంట్ ఎన్డీయే కూటమి బీజేపీ అభ్యర్థిగా ఎంపికైన తర్వాత తొలిసారి జిల్లాకు వచ్చిన భూపతి రాజు శ్రీనివాసవర్మ కు నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పశ్చిమగోదావరి జిల్లా సరిహద్దు ఉప్పుటేరు వంతెన వద్దకు చేరుకున్న వర్మకు, హారతులు ఇచ్చి గజమాలతో బిజెపి శ్రేణులు ఆత్మీయ స్వాగతం పలికారు. అక్కడి నుండి భారీ ర్యాలీగా భీమవరం ఎన్నికల కార్యాలయానికి చేరుకున్నారు.
ఇది చదవండి: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అధికారి…
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి