మహేశ్వరం మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి వారి కోడలు రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి గార్లు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వారికి మద్దతుగా మహేశ్వరం నియోజకవర్గం టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు వివిధ పదవుల్లో ఉన్న నాయకులు తీగల కృష్ణారెడ్డి గారికి మద్దతుగా నిలిచారు మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నందమూరి తారక రామారావు పిలుపు మేరకు 1983 నుండి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ కూడా చైర్మన్ గా నగర మేయర్ గా పార్టీ లో పలు పదవులు నిర్వహించాను. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ బీఫామ్ పై ఎమ్మెల్యేగా గెలిచాను. మహేశ్వరం నియోజకవర్గ అభివృద్ధి కొరకు కేసిఆర్ పిలుపుమేరకు టిఆర్ఎస్ పార్టీలో చేరాను మహేశ్వర నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నేను చేసిన అభివృద్ధి ఇప్పటికీ కనిపిస్తుంది. నేను ఓడిన గత ఐదు సంవత్సరాలుగా టిఆర్ఎస్ పార్టీలో పని చేస్తూ వస్తున్న నాకు సముచిత స్థానం కల్పించలేకపోయారు. కనుక రేవంత్ రెడ్డి గారి పిలుపుమేరకు కాంగ్రెస్ పార్టీలో ఈనెల చేవెళ్లలో ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్ తీగల అనిత హరినాద్ రెడ్డి మాట్లాడుతూ క్యాబినెట్ పోస్టు ఉన్న నాకు సంక్షిత స్థానం కల్పించకపోవడంతో ఎమ్మెల్యేలకు సంచితస్థానం కల్పించడంపై టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆమె ప్రకటించారు.
బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్…
119
previous post