105
నెల్లూరు(Nellore) వైసీపీ రాజకీయాల్లో ఇప్పటివరకు కొనసాగిన ఉత్కంఠతకు తేర పడింది. నెల్లూరులో వైసీపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. పార్టీ సభ్యత్వానికి, జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఇప్పటివరకు తనకు సహకరించిన వారికి ధన్యవాదాలు చెప్పి ఇంటికి వెనుదిరిగారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఈ మేరకు సీఎం జగన్ కు ఆయన లేఖ రాశారు. తన వ్యక్తిగత కారణాల వల్ల పార్టీని వీడుతున్నట్లు ఆయన లేఖలో వెల్లడించారు. ఇక వేమిరెడ్డి ఏ పార్టీలో చేరతారు అన్న అంశంపై సస్పెన్స్ నెలకొంది.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.