గొర్రెల మందపైకి దూసుకెళ్లిన బొలెరో..

Bolero hit the flock of sheep..

Advertisements

&NewLine;<p>కళ్యాణదుర్గం మండలం గూబనపల్లి సమీపంలో గురువారం తెల్లవారుజామున గొర్రెల మందపైకి బొలెరో వాహనం దూసుకెళ్లింది&period; ఈ ప్రమాదంలో 26 గొర్రెలు మృతి చెందగా మరో 30 గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి&period; కంబదూరు మండలం కర్తనపర్తి గ్రామానికి చెందిన గొర్రెల యజమాని మారెప్పకు చెందిన 500 వందల గొర్రెలు మేత కోసం కర్ణాటకలోని బళ్లారి ప్రాంతానికి వెళ్తున్నాయి&period; గురువారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో గూబనపల్లి సమీపంలో ప్రధాన రహదారిపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం ఢీకొట్టింది&period; 26 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా మరో 30 గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి&period; ప్రమాదం జరిగిన వెంటనే బొలెరో డ్రైవర్ బండి రోడ్డు పక్కన వదిలి పరారయ్యారు&period; సుమారు 6 లక్షల వరకు నష్టం జరిగినట్లు గొర్రెల కాపరి మాధవయ్య తెలిపారు&period; తమకు జరిగిన నష్టాన్ని వాహన యజమాని నుండి చెల్లించేలా చొరవ తీసుకోవాలని బాధిత గొర్రెల యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు&period; సంఘటన స్థలానికి పోలీసులు వచ్చి ట్రాఫిక్ కి అంతరాయం లేకుండా గొర్రెలను రహదారిపై లేకుండా పక్కకు తొలగించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…

అల్లూరి జిల్లాలో రోడ్లు లేని గిరిజన గ్రామాలు…

జీటీ ఉత్కంఠభరిత విజయం – తేవాటియా శాంతమైన ముగింపు, గిల్-బట్లర్ ధాటికి ఆర్సీబీ పరాభవం..