పలమనేరు నియోజకవర్గం 2014 సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన సీనియర్ నాయకుడు ఆర్.వి సుభాష్ చంద్రబోస్, శుక్రవారం సాయంత్రం తాడేపల్లిగూడెం నందు, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్సీ భరత్, పలమనేరు ఎమ్మెల్యే వెంటే గౌడ్ పాల్గొన్నారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయనకు సీఎం సూచించారని సమాచారం. గత ఆదివారం ఆత్మీయ సమావేశంలో ఏ పార్టీలో చేరుతారని ప్రశ్నించినప్పుడు, ఆత్మీయులు ప్రజలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని నేడు అధికార వైసీపీ పార్టీలో చేరారు. పలమనేరు నియోజకవర్గ వ్యాప్తంగా ఏనోట విన్నా “బోస్” వైసీపీ పార్టీలో చేరారన్నది హాట్ టాపిక్ గా మారింది.
ఎక్కడ చూసిన ఇదే హాట్ టాపిక్….
88
previous post