75
నెల్లూరు జిల్లాలో ఈరోజు సామాజిక సాధికారిక బస్సు యాత్ర ప్రారంభం కానుంది. కోవూరు నియోజకవర్గంలోని నార్త్ రాజపాలెంలో జరిగే బస్సు యాత్ర కోసం పెద్ద ఎత్తన జనసమీకరణ చేస్తున్నారు. ఈ సమావేశానికి నియోజకవర్గం నుంచి సుమారు 15 వేల మంది హాజరవుతారని భావిస్తున్నారు. దీంతో రాజుపాలెం సెంటర్ మొత్తం వైఎస్సార్ సిపి ఫ్లెక్సీలతో నీలిమయమైంది. ఈ కార్యక్రమానికి మంత్రి కాకాణి, ఎంపీలు విజయసాయిరెడ్డి, బీద మస్తాన్ రావు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర, ఎమ్మెల్యేలు, మీడియా అడ్వయిజర్ సినీ నటుడు అలీ హాజరుకానున్నారు.