Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Latest News రేవంత్ రెడ్డిని కలిసిన మెగాస్టార్..

రేవంత్ రెడ్డిని కలిసిన మెగాస్టార్..

by Rama
Revanth reddy-megastar

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కలుసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన చిరంజీవి.. ఆయనతో భేటీ అయ్యారు. దాదాపు గంటసేపు వీరిద్దరూ పలు అంశాలపై చర్చించుకున్నారు. తెలంగాణలో తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక టాలీవుడ్ నుంచి సీఎం రేవంత్ రెడ్జిని కలిసిన తొలి ప్రముఖుడు చిరంజీవి మాత్రమే. దీంతో వీరిద్దరి భేటీలో చర్చించిన అంశాలపై ఆసక్తి నెలకొంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎన్నికయ్యాక చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ తొలిసారి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం హైదరాబాద్ లో పలువురు సినీ ప్రముఖులు రేవంత్ కు శుభాకాంక్షలు తెలిపారు. అయితే చిరంజీవి మాత్రం రేవంత్ తో నేరుగా భేటీ అయిన తొలి సినీ హీరోగా నిలిచారు. ప్రభుత్వానికి టాలీవుడ్ తరఫున కూడా అన్ని విధాలా సహకారం అందిస్తామని చిరు హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో రేవంత్ కూడా తెలుగు చిత్ర పరిశ్రమకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

Read Also..

Advertisements

You may also like

Our Visitor

039391
Total views : 196626

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: