ముగిసిన కేబినెట్ సమావేశం

Revanth Reddy

Advertisements

&NewLine;<p>సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది&period; మంత్రివర్గ సమావేశంలో గవర్నర్ ప్రసంగానికి ఆమోదం లభించింది&period; గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు&period; గవర్నర్ ప్రసంగంలో ఉండాల్సిన అంశాలపై కేబినెట్లో చర్చించారు&period; కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గవర్నర్ తొలి ప్రసంగం కాబట్టి ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనే అంశంపై దాదాపు గంటన్నర పాటు చర్చించారు&period; అదే సమయంలో ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది&quest; మున్ముందు ఎలా ఉండబోతుంది&quest; అనే అంశాలతో గవర్నర్ ప్రసంగంలో ఉండనున్నట్లుగా సమాచారం&period; ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను ప్రకటించింది&period; ఇందులో రెండు గ్యారెంటీలలో కొన్ని అంశాలను అమలు చేస్తోంది&period; మిగతా గ్యారెంటీలపై కేబినెట్ సమావేశంలో చర్చించారు&period; ఆ తర్వాత గవర్నర్ ప్రసంగాన్ని ఆమోదిస్తూ తీర్మానం చేసింది&period; కాగా&comma; ఈ నెల 9న కొత్త ప్రభుత్వం కొలువుదీరింది&period; కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు&period; దీంతో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రేపు ప్రసంగిస్తారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..