సమ్మె విఫలం చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం….

Break the door locks

Advertisements

&NewLine;<p>గత మూడు రోజులుగా తమ డిమాండ్లు నెరవేర్చాలని రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు&comma; ఆయాలు సుమారు లక్ష పదివేల మంది రోడ్డుమీద నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నారు&period; తమ ప్రధానమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని తమ యూనియన్ ప్రతినిధులు ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో అంగన్వాడీలు&comma; తప్పని పరిస్థితుల్లో అంగన్వాడీ సెంటర్లను మూసివేసి నిరవధిక సమ్మెకు దిగారు&period; ఈ తరుణంలో ప్రభుత్వం ఎలాగైనా అంగన్వాడీల సమ్మెను విఫలం చేయాలని ఆలోచనతో ఈరోజు బాపట్ల మండలం స్టువర్ట్ పురం గ్రామంలో ఎస్టి కాలనీలోని తాళాలు వేసి ఉన్న అంగన్వాడీ సెంటర్ ను బలవంతంగా సచివాలయం సిబ్బంది&comma; పంచాయతీ సెక్రెటరీ వీఆర్వో తదితర సిబ్బందితో తాళాలు పగలగొట్టి అంగన్వాడీ సెంటర్ ను తెరిచారు&period; ఈ విషయం తెలుసుకున్న అంగన్వాడీ సిబ్బంది అధికారులపై మండిపడ్డారు&period; తమ అనుమతి లేకుండా తమ సెంటర్ తాళాలు పగలగొట్టి తెరవడం అన్యాయమని ఆ సెంటర్లోని వస్తువులు మా వ్యక్తిగత ఫైళ్లు ఉంటాయని వాటికి ఏమైనా నష్టం వాటిల్తే ప్రభుత్వ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని వారు అన్నారు&period; బాపట్ల మండలం స్టువర్ట్ పురం గ్రామంలోని అంగన్వాడి సెంటర్ లో కోడ్ నెంబర్ 20 ఎస్టి కాలనీ అంగన్వాడీ వర్కర్ ఆయా నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నారు&period; ఆ క్రమంలో సచివాలయ సిబ్బంది&comma; పంచాయతీ సెక్రెటరీ&comma; వీఆర్వో దగ్గరుండి తాళాలు పగలగొట్టి సెంటర్ ను తెరిపించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్