పిప్పి పన్నుతో బాధపడేవారు ఒక చిన్న టెక్నిక్ ద్వారా పళ్ళను శుభ్రం చేసుకోవడం మాత్రమే కాకుండా పిప్పిపంటి బాధను చక్కగా ఇంట్లోనే తగ్గించుకునే ఔషధాల మొక్క గురించి చెప్పబోతున్నాను. ఇది మీరు ఏమి చేయాల్సిన పనేలేదు ఈ మొక్క ఆకులు మీకు దొరికితే చాలు మీ పంటి సంబంధిత సమస్యలు పరారు.. అక్టోబర్లో సీతాఫలం పండు విరివిగా లభిస్తుంది. ఈ సీజన్లో మాత్రమే దొరికే ఈ పండు చక్కటి రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే కేవలం పండు మాత్రమే కాదు.. సీతాఫలం ఆకులు కూడా అనేక అనారోగ్య సమస్యలను నయం చేస్తాయి. మన అవయవాల్లో అతిపెద్ద అవయవం చర్మం చాలామంది చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. కొంతమందికి వ్యాధి తీవ్రత ఎక్కువుంటే మరి కొంత మందికి పింపుల్స్ రూపంలో లేదా రాసేస్ రూపంలో చిన్న చిన్న పొక్కుల రూపంలో ఉంటూ ఉంటాయి. వాటిని చాలా మంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అయితే ఇక మీదట మీరు ఇలాంటి సమస్యల నుంచి బయటపడొచ్చు. దీనికి ఎం చేయాలంటే కొన్ని సీతాఫల ఆకులను తెచ్చుకుని పసుపు ఉప్పు వేసి మెత్తగా నూరి ఆ పేస్ట్ ను మీకు ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ అప్లై చేస్తే ఎలాంటి భయంకరమైన పుండ్లు అయినా సరే తగ్గిపోతాయి. నోటి దుర్వాసనతో కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు ముందుగా నోటి దుర్వాసన పోవడానికి ఈ సీతాఫల ఆకులను ఒకటి రెండు తెచ్చుకుని శుభ్రంగా కడిగి నోట్లో వేసి బాగా నమలండి. అలా నమలిన తర్వాత ఆ పిప్పి తో ఒకసారి పళ్ళను బాగా రుద్దుకోండి. తర్వాత నోట్లో నీళ్లు వేసుకుని పుక్కిలించి ఊసి మరొకసారి మంచినీటితో నోటిని శుభ్రం చేసుకోండి. ఇలా మీరు ప్రతిరోజూ చేయడం వల్ల నోట్లో ఉండే క్రీములు చచ్చిపోతాయి. అలాగే పంటి గార కూడా తగ్గిపోతుంది. చిగుళ్ళ నుంచి రక్తం కారడం కూడా తగ్గుతుంది. ముఖ్యంగా మీ పళ్ళు చాలా తెల్లగా మారుతాయి. ఇక దుర్వాసన అనే సమస్య ఉండదు. ముఖ్యంగా పిప్పి పన్ను కూడా చాలా తొందరగా నయమవుతాయి. ఆ నొప్పి కూడా తగ్గుతుంది. పిప్పి పన్ను కోసం ఏం చేయాలంటే మీరు సీతాఫలం ఆకులను తెచ్చుకుని పేస్ట్ లాగా మెత్తగా నూరి ఎక్కడైతే పిప్పి పన్ను ఉందో ఆ పిప్పి పన్ను మీద ఈ పేస్టు ఉంచితే లోపల క్రిములు చచ్చిపోతాయి. పిప్పి పన్ను పెయిన్ కూడా ఆశ్చర్యంగా తగ్గిపోతుంది. అంటే ఎంత తొందరగా తగ్గిపోతుంది చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఇప్పటికి కూడా చాలా పల్లెటూర్లలో ఆకులను వివిధ వ్యాధులను తగ్గించడానికి వాడుతున్నారు. ముఖ్యంగా పంటి సంబంధిత సమస్యల కోసం ఎక్కువగా వాడుతూ ఉంటారు.
పిప్పి పన్నుకి శాశ్వత పరిష్కారం..!
112
previous post