టీడీపీ అధినేత చంద్రబాబు పల్నాడు జిల్లా క్రోసూరులో ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ కల్యాణ్ ఎప్పుడూ చెబుతుంటారని, ఈ రాష్ట్రానికి పట్టిన పీడ విరగడ అవ్వాలంటే అందరం కలిసి పనిచెయ్యాలని చెప్పిన ఏకైక నాయకుడు పవన్ కల్యాణ్ అని కొనియాడారు. ఇవాళ కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉందని, మళ్లీ రాబోయేది కూడా ఎన్డీయే ప్రభుత్వమేనని అన్నారు. ప్రజల భవిష్యత్తు కోసమే ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ జట్టు కట్టాయని చంద్రబాబు స్పష్టం చేశారు. మైనారిటీ సోదరులకు ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా… వైసీపీ హయాంలో మీకు అన్యాయం జరిగింది కానీ… తాను ఎన్డీయేలో ఉన్నప్పుడు కానీ, భవిష్యత్తులో కానీ ఏ ముస్లిం సోదరుడికి కానీ అన్యాయం జరగదని హామీ ఇస్తున్నా అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.
రాష్ట్రానికి పట్టిన పీడ విరగడ అవ్వాలంటే..
73
previous post