Wednesday, July 22, 2026
News Navigation
Wednesday, July 22, 2026
News Navigation

Breaking

Wednesday, July 22, 2026
Home Andhra Pradesh శాంతిగా, స్వేచ్ఛగా, న్యాయంగా… ఎన్నికల కీలక ఘట్టాలు

శాంతిగా, స్వేచ్ఛగా, న్యాయంగా… ఎన్నికల కీలక ఘట్టాలు

by Prakash
AP ELECTIONS

అమరావతి | AP Elections

  • శాంతిగా, స్వేచ్ఛగా, న్యాయంగా ఎన్నికలను నిర్వహించే బాధ్యత డిఇఓలు, ఎస్పీలదే.
  • ఓర్పుతో వ్యవహరిస్తూ అవగాహనతో సమస్యలపై తక్షణమే స్పందించండి, పరిష్కరించండి.
  • నగదు జప్తు విషయంలో సాధారణ పౌరులకు ఎటువంటి ఇబ్బందులు కలిగించవద్దు.
  • నగదు జప్తు కేసులను 24 గంటల్లోనే పరిష్కరించాలి, రాష్ట్ర మంతా ఒకే ఎస్.ఓ.పి. అమలు
  • ఇసిఐ నుండి సరైన వివరణ వచ్చేలోపు ఇంటింటి ప్రచారానికి ముందస్తు సమాచారం ఇస్తే చాలు – రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా

Follow us on : Google News మరిన్నితాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలను(AP Elections) శాంతియుతంగా, స్వేచ్ఛగా మరియు న్యాయబద్దంగా నిర్వహించాల్సిన బాధ్యత జిల్లా ఎన్నికల అధికారులు మరియు ఎస్పీలపైనే ఉందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా(Mukesh Kumar Meena) పేర్కొన్నారు. ఇందుకై వీరిరువురూ సమన్వము, ఓర్పుతో వ్యవహరిస్తూ సమస్యలపై సమగ్ర అవగాహనలతో తక్షణమే స్పందిస్తూ పరిష్కరించాలని ఆదేశించారు. శనివారం రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, పోలీస్ సూపరింటెండెట్లు, పోలీస్ కమిషనర్లతో ఆయన మీడియో కాన్పరెన్సు నిర్వహించి ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు చేస్తున్న ఏర్పాట్లను, తీసుకుంటున్న చర్యలను మరియు ఎన్నికల ప్రవర్తనా నియమావళి పటిష్టంగా అమలుపర్చే అంశాలను సమీక్షించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో(Elections) ఎటు వంటి హింసకు, రీపోలింగ్ కు తావులేకుండా పటిష్టమైన భద్రతా చర్యలను చేపట్టాలన్నారు. గంజాయి, లిక్కర్, నగదు, ఉచితాల అక్రమ రవాణాపై పటిష్టమైన నిఘా ఉంచాలని, రాష్ట్రాల సరిహద్దులు, జిల్లాల సరిహద్దుల్లో ఉండే చెక్ పోస్ట్ లో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. గోవా, హర్యానా నుండి అక్రమంగా లిక్కర్ రాష్ట్రంలోకి రాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, వ్యక్తులు రూ.50 వేలకు మించి నగదు కలిగి ఉంటే వెంటనే జప్తుచేయాలని, వ్యాపారులు, సాదారణ పౌరుల విషయంలో ఆచితూచి అడుగువేయాలని, వారిని ఎటు వంటి ఇబ్బందులకు గురిచేయవద్దన్నారు. నగదు జప్తు కేసులను 24 గంటల్లోనే పరిష్కరించాలని, ఇందుకై రాష్ట్ర మంతా ఒకే విదానాన్ని అనుసరించేలా త్వరలో ఎస్.ఓ.పి.ని (Standard Operating Procedure) రూపొందించి కమ్యునికేట్ చేయనున్నట్లు తెలిపారు.

రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇంటింటి ప్రచారానికై ముందస్తుగా పొందాల్సిన అనుమతి విషయంలో తగిన వివరణకై భారత ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపడమైనదని, అయితే ఈ అంశంలో తగిన వివరణ అందేలోపు ఇంటింటి ప్రచారానికి సంబందించి ముందస్తు సమాచారాన్ని సంబందిత ఆర్.ఓ.కు మరియు సంబందిత పోలీస్ స్టేషన్ కు ఇస్తే చాలు అనే విషయాన్ని అన్ని రాజకీయ పార్టీలకు తెలియజేయాలని సూచించారు.

భారత ఎన్నికల సంఘం రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక పరిశీలకును నియమించిందని, వీరే ఎన్నికల సంఘానికి(AP Elections) కళ్లు, చెవులు వంటి వారని, వీరు నేరుగా ప్రధాన ఎన్నికల కమిషనర్ నేతృత్వంలో పనిచేస్తుంటారన్నారు. ప్రత్యేక సాధారణ పరిశీలకులు, ప్రత్యేక వ్యయ పరిశీలకు ఇప్పటికే రాష్ట్రావని వచ్చి పలు ప్రాంతాల్లో పర్యటించారన్నారు. రాష్ట్రంలో చేస్తున్న ఎన్నికల ఏర్పాట్లు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు విషయంలో వీరు సంతృప్తి చెందేలా చూసుకోవాలన్నారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన ఫిర్యాదులపై తక్షణమే చర్యలు చేపట్టాలని, తమ కార్యాలయం నుండి పంపించే ఫిర్యాదులపై జిల్లా స్థాయిలోనే సమగ్రమైన విచారణ జరిపి చర్యలు తీసుకున్న తదుపరి మాత్రమే నివేదిక పంపాలని ఆదేశించారు. తదుపరి చర్యల కోసం తగు ఆదేశాలు జారీ చేయాలని తమ కార్యాలయం నివేదిక పంపొద్దు అని స్పష్టంగా సూచించారు.

వీడియో కాన్పరెన్సు ముగింపు సందర్బంగా రాష్ట్ర పోలీస్ నోడల్ అధికారి మరియు అదనపు డిజిపి (లా & ఆర్డర్) శంక్బ్రత్ బాగ్చీ మాట్లాడుతూ ప్రత్యేక సాధారణ పరిశీలకులు రామ్ మోహన్ మిశ్రా రాష్ట్ర పర్యటన సందర్బంగా చేసిన పలు సూచలను డి.ఇ.ఓ.లకు, ఎస్పీలకు వివరించారు. రూ.10 లక్షలకు పైబడి జప్తుచేయబడిన నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువుల సమచారాన్ని ఎప్పటి కప్పుడు ఐ.టి. అధికారులకు తెలియపర్చాలన్నారు. ఎన్ఫోర్సుమెంట్ ఎజన్సీల నోడల్ అధికారులతో తరచుగా సమావేశమై గంజాయి, లిక్కర్, నగదు, ఉచితాల అక్రమ రవాణాపై నిఘాను పటిష్టపర్చాలన్నారు. లిక్కర్, డ్రగ్స్ రవాణా చేసే కింగ్ పిన్లపై తగు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రాల సరిహద్దులు, జిల్లాల సరిహద్దుల్లో ఉండే చెక్ పోస్ట్ ల్లో కూడా నిఘాను మరింత పటిష్టపర్చాలని ఆదేశించారు.

అదనపు సీఇఓ పి.కోటేశ్వరరావు మాట్లాడుతూ ఏఆర్వోలు అదనంగా కావాల్సిన వారు సంబందిత జాబితాలను మూడు రోజుల్లో సి.ఇ.ఓ. కార్యాలయానికి పంపిస్తే, వాటిని కన్సాలిడేట్ చేసి ఇ.సి.ఆమోదం కోసం పంపిస్తామన్నారు.

అదనపు సీఇఓ ఎమ్.ఎన్. హరెంధిర ప్రసాద్ మాట్లాడుతూ సోషల్ మీడియా కంప్లైంట్స్ పై తగు చర్యలు తీసుకునేందుకు ఇప్పటికీ ఎస్.ఓ.పి.ని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు కమ్యునికేట్ చేయడం జరిగిందని మరియు మీడియాకు అథారిటీ లెటర్స్ జారీకై సమగ్ర సమాచారాన్ని కూడా అందజేయడం జరిగిందని, వాటికి అనుగుణంగా చర్యలు చేపట్టాలని కోరారు.

ఈ సమావేశంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, పోలీస్ సూపరింటెండెంట్లు, పోలీస్ కమిషనర్లతో పాటు జాయింట్ సీఈఓ ఎ.వెంకటేశ్వరరావు, డిప్యూటీ సీఈఓ కె.విశ్వేశ్వరరావు, అసిస్టెంట్ సీఈవో తాతబ్బాయి తదితరులు పాల్గొన్నారు.


నీట్‌ నిరసన సెగ హైదరాబాద్‌ కు తగిలింది.
నీట్‌ నిరసన సెగ హైదరాబాద్‌ కు తగిలింది. నాంపల్లి పరిసర ప్రాంతాలు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల …
జనరిక్ మెడిసిన్ దిగుమతులపై ట్రంప్ కీలక ప్రకటన.
జనరిక్‌ ఔషధాల దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 1 …
సి.వి.రావును కలిసిన సినీ నిర్మాత, కాంగ్రెస్‌ నేత బండ్ల గణేష్.
ప్రముఖ సినీ నిర్మాత, తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేష్ ఈరోజు ఇమేజ్ హాస్పిటళ్లు, సీవీఆర్ …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

042284
Total views : 223767

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: