తెనాలి ప్రజాగళం సభ(Tenali Prajagalam Sabha)లో టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) ఉత్సాహంగా ప్రసంగించారు. ఆంధ్రా ప్యారిస్ తెనాలికి చాలాసార్లు వచ్చాను కానీ, ఈ జనసందోహాన్ని చూసిన తర్వాత మరింత హుషారుగా ఉందని అన్నారు. మే 13తో రాష్ట్రానికి సైకో పీడ వదిలించుకునేందుకు సిద్ధంగా ఉన్నారా, లేరా? అని ప్రశ్నించారు. తెనాలి అసెంబ్లీ స్థానం జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ను, గుంటూరు ఎంపీ స్థానం టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ను గెలిపించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. తాను, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, బీజేపీ నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్ మేనిఫెస్టో విడుదల చేశామని చెప్పారు. మన మేనిఫెస్టోకి, సైకో మేనిఫెస్టోకి పోలిక ఉందా? అని వ్యాఖ్యానించారు. ఈ ఐదేళ్లలో ప్రజలు అనేక అవకాశాలు, ఆదాయం కోల్పోయారని, ధరలు పెరిగి ఇబ్బందులు పడ్డారని, రైతులకు గిట్టుబాటు ధరలు కూడా లేవని తన ఆవేదన అదేనని అన్నారు. మైనారిటీలు, మహిళలు రాష్ట్రంలో ఇలా ఎవరూ బాగుపడలేదని తెలిపారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రి మూసివేతపల్నాడు జిల్లాలో కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రిని మూసేశారు. గురజాల నియోజకవర్గం దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని లాలా బజారులో ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రానికి కరెంటు బిల్లు కట్టలేదనే సాకుతో మూసీవేశారు.గత వైసీపీ హయాంలో సుమారు…
- ఏపీలో 53 బార్లకు రీనోటిఫికేషన్ఏపీలో 53 బార్ల వేలం కోసం ఎక్సైజ్ శాఖ రీనోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 22 వరకు దరఖాస్తులు సమర్పించేందుకు గడువుగా నిర్ణయించారు. ఈ నెల 23న దరఖాస్తులను పరిశీలిస్తారు.…
- 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాంఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం అధికారులు, ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు. చైనాలోని త్రీ గోర్జెస్ డ్యామ్ కంటే పోలవరం మెరుగైన ప్రాజెక్టు అని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం 2014-19 మధ్య రాత్రింబవళ్లు శ్రమించామని…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.