Tuesday, April 28, 2026
News Navigation
Tuesday, April 28, 2026
News Navigation

Breaking

Tuesday, April 28, 2026
Home Andhra Pradesh కొయ్యలగూడెంలో పవన్ కల్యాణ్ వారాహి విజయభేరి సభ..

కొయ్యలగూడెంలో పవన్ కల్యాణ్ వారాహి విజయభేరి సభ..

by Satya
Pawan Kalyan

పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం(Koyalagudem)లో జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) వారాహి విజయభేరి(Varahi Vijayabheri Sabha) సభ నిర్వహించారు. పోలవరం ప్రాంతానికి కరాటం రాంబాబు కుటుంబం ఎంతో చేసిందని అన్నారు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన తనను భుజం తట్టి ప్రోత్సహించారని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి(Rajasekhar Reddy) హయాంలో పోలవరం ముందుకు కదిలింది అంటే అందుకు కారణం కరాటం రాంబాబు కుటుంబమేనని, వారి కుటుంబం పోలవరం ప్రాజెక్టుకు 110 ఎకరాలు ఇచ్చేసిందని వెల్లడించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 2018 నాటికి పోలవరం 50 శాతం పూర్తయిందని, కానీ జగన్ అధికారంలోకి వచ్చి పోలవరం ప్రాజెక్టుపై ఎన్నో కథలు చెప్పాడని పవన్ కల్యాణ్ విమర్శించారు. పునరావాస ప్యాకేజి అమలు చేస్తామని గిరిజనుల సహా అందరినీ నమ్మించాడని, కానీ ఇంతవరకు అమలు చేయలేదని మండిపడ్డారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News


  • సింగపూర్లో ఏడో రోజు కొనసాగుతున్న ఏపీ మంత్రుల పర్యటన
    ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా సింగపూర్‌లో జరుగుతున్న ఏపీ మంత్రుల ఉన్నత స్థాయి శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఏడో రోజున సింగపూర్ ప్రభుత్వ డిజిటల్ పరివర్తన, పౌర సేవల్లో సాంకేతికత వినియోగంపై మంత్రుల బృందం సమగ్ర అధ్యయనం చేసింది. సింగపూర్…
  • విశాఖలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనకు సిద్ధం..
    విశాఖపట్నంలో భారీ ఐటీ పెట్టుబడులకు మార్గం సుగమం అవుతోంది.ఆనందపురం మండలం తర్లువాడ గ్రామంలో ప్రతిష్టాత్మక గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ ఏర్పాట్లను జిల్లా ఇంచార్జి మంత్రి డోలా బాల వీరాంజనేయులు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు,…
  • గజపతినగరంలో అదుపులేని ఇసుక అక్రమ రవాణా ..
    విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా రోజు రోజుకీ తీవ్రమవుతోంది. నదులు, వాగులు సహజసిద్ధంగా ఉండాల్సిన చోట రాత్రి వేళల్లో ట్రాక్టర్లు, లారీలు విరుచుకుపడుతూ ఇసుకను తరలిస్తున్నాయి. ఈ దోపిడీ వల్ల పర్యావరణ సమతుల్యతకు తీవ్రమైన ముప్పు ఏర్పడుతోంది.…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Our Visitor

008634
Total views : 56999

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.