తెనాలి ప్రజాగళం సభ(Tenali Prajagalam Sabha)లో టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) ఉత్సాహంగా ప్రసంగించారు. ఆంధ్రా ప్యారిస్ తెనాలికి చాలాసార్లు వచ్చాను కానీ, ఈ జనసందోహాన్ని చూసిన తర్వాత మరింత హుషారుగా ఉందని అన్నారు. మే 13తో రాష్ట్రానికి సైకో పీడ వదిలించుకునేందుకు సిద్ధంగా ఉన్నారా, లేరా? అని ప్రశ్నించారు. తెనాలి అసెంబ్లీ స్థానం జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ను, గుంటూరు ఎంపీ స్థానం టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ను గెలిపించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. తాను, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, బీజేపీ నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్ మేనిఫెస్టో విడుదల చేశామని చెప్పారు. మన మేనిఫెస్టోకి, సైకో మేనిఫెస్టోకి పోలిక ఉందా? అని వ్యాఖ్యానించారు. ఈ ఐదేళ్లలో ప్రజలు అనేక అవకాశాలు, ఆదాయం కోల్పోయారని, ధరలు పెరిగి ఇబ్బందులు పడ్డారని, రైతులకు గిట్టుబాటు ధరలు కూడా లేవని తన ఆవేదన అదేనని అన్నారు. మైనారిటీలు, మహిళలు రాష్ట్రంలో ఇలా ఎవరూ బాగుపడలేదని తెలిపారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- అన్నమయ్య జిల్లాలో ఘనంగా విరుపాక్షమ్మ తల్లి పుష్కరోత్సవాలు.అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లిలోని శ్రీ విరుపాక్షమ్మ తల్లి ఆలయంలో పుష్కరోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ నిర్మాణానికి 12 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.మూడు…
- మళ్లీ పెరిగిపోతోన్న కొవిడ్-19 కేసులు.ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి మళ్లీ కలకలం రేపుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొత్తగా కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. తక్షణమే అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్ 26వ తేదీ నుంచి…
- అమరావతిలో అసైన్డ్ భూముల వ్యవహారంలో హైకోర్టు సంచలన తీర్పు.అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. గత వైసీపీ హయాంలో సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలపై నమోదైన కేసులను పూర్తిగా కొట్టివేసింది. ఈ కేసులు కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని న్యాయస్థానం తన…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 212552