అంగన్వాడీ మహిళలను ఏడిపిస్తున్న ముఖ్యమంత్రి…

Jail Bharo Program

Advertisements

&NewLine;<p>ఆంధ్ర రాష్ట్రంలో అంగన్వాడీ మహిళలను ఏడిపిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తులో ఏడుపే మిగులుతుందని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి అన్నారు&period; కార్మిక సంఘాల రాష్ట్ర పిలుపులో భాగంగా సిఐటియు&comma; ఏఐటియుసి&comma; ఐఎఫ్టియుల ఆధ్వర్యంలో తిరుపతి నగరంలో మంగళవారం నాడు పెద్ద ఎత్తున జైలు భరో కార్యక్రమం జరిగింది&period; రాష్ట్రంలో సమ్మెలో ఉన్న అంగన్వాడీలు&comma; మున్సిపల్ కార్మికులు&comma; సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జైలు భరో కార్యక్రమం మంగళవారం నాటి ఉదయం తిరుపతి నగరంలో జరిగింది&period; పాత మున్సిపల్ కార్యాలయం నుండి సిఐటియు&comma; ఏఐటియుసి&comma; ఐఎఫ్టియు కార్యకర్తలు&comma; నాయకులతో పాటు అంగన్వాడీలు&comma; ఎస్ఎస్ఏ లు పెద్ద సంఖ్యలో ప్రదర్శన చేపట్టారు&period; ప్రదర్శన నాలుగు కాళ్ల మండపం వద్దకు చేరుకునేటప్పటికీ పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు&period; ప్రదర్శనను నిలిపివేయాలని ముందుకు వెళ్లడానికి వీలులేదని ఆంక్షలు పెట్టారు&period; దీంతో అంగన్వాడీలు&comma; కార్మిక సంఘాల నేతలు నాలుగు కాళ్ల మండపం వద్ద బైఠాయించారు&period; మహిళలు పెద్ద సంఖ్యలో ఉండటంతో మగ పోలీసులతో అరెస్టు చేయటానికి పోలీసులు సంకోచిస్తూ తటపటాయించారు&period; ముందుకు పోనివ్వకుండా అరెస్టులు చేయకుండా నడిరోడ్డుపై కూర్చోబెట్టడాన్ని సహించలేని కార్మిక సంఘాల నేతలు తాము ప్రదర్శనని చేపడుతున్నామని ప్రకటించి ముందుకెళ్లారు&period; తూర్పు పోలీస్ స్టేషన్ డిఎస్పీ అందరినీ అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించడంతో పోలీసుల నడుమ భారీ సంఖ్యలో అంగన్వాడీలను తూర్పు పోలీస్ స్టేషన్ కు తరలించారు&period; ఈ సందర్భంగా సిఐటియు&comma; ఎఐటియుసి&comma; ఐఎఫ్టియుల నేతలు కందారపు మురళి&comma; కె&period; రాధాకృష్ణ&comma; ఆర్&period; హరికృష్ణలు ప్రసంగిస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు&period; 29 రోజులుగా సమ్మె సాగిస్తుంటే కనీసం సమస్యల పరిష్కారానికి చర్చించకపోగా ఎస్మాను ప్రయోగించి అంగన్వాడీ మహిళలను అపహాస్యం పాలు చేశారని మండిపడ్డారు&period; ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఒక మాట&comma; ఎన్నికల తర్వాత మరో మాట మాట్లాడటం ఆనవాయితీగా మారిందని తీవ్ర స్థాయిలో విమర్శించారు&period; తక్షణం కార్మిక సమస్యలు పరిష్కారం చేయకుంటే ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడించడం ఖాయమని నేతలు హెచ్చరించారు&period; తూర్పు పోలీస్ స్టేషన్ అంగన్వాడీ మహిళలతో నిండిపోయింది&period;ఈ సందర్భంగా కార్మిక సంఘాల నేతలు అంగన్వాడీలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు&period; సమస్యలను సామరస్యంగా పరిష్కరించకుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.